Karnataka Elections: కర్ణాటక ఎన్నికలు ముగిశాయి. అయితే ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ, మ్యాజిక్ ఫిగర్ 113 రాకపోవచ్చని, హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. దీంతో మరోసారి జేడీఎస్ కింగ్ మేకర్ పాత్రను పోషించేందుకు సిద్ధం అయింది. అయితే ఇలాంటి పరిస్థితి వస్తే అధికారం ఏర్పాటు చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమను సంప్రదించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు జేడీఎస్ చెబుతోంది. అయితే ఇటు బీజేపీ కానీ,…
Perni nani: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కామెంట్లకు కౌంటర్ ఎటాక్ దిగారు వైసీపీ నేతలు.. తాజాగా, పొత్తుల వ్యవహారంలో జనసేనాని చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి పేర్నినాని.. జనసేన పార్టీ టెంట్ హౌస్ పార్టీ.. చంద్రబాబు అవసరాల కోసం పెట్టిన టెంట్ హౌస్ పార్టీ జనసేన అంటూ సెటైర్లు వేశారు. ఓట్ల కోసం మాత్రమే రాజకీయాలు చేయడం పవన కళ్యాణ్ కి చెల్లిందన్న ఆయన.. వారాహి అంటూ హడావిడి చేసిన పవన్ ముందస్తు ఎన్నికలు…
TG Venkatesh: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. పొత్తులు, సీఎం పోస్టులపై ఎప్పటి నుంచో చర్చ సాగుతూనే ఉంది.. తాజాగా మరోసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.. అయితే, ఇప్పుడు మాజీ మంత్రి టీజీ వెంకటేష్ కూడా పొత్తుల వ్యవహారంలో హాట్ కామెంట్లు చేశారు.. కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు , పవన్ కళ్యాణ్ పై పర్సనల్ అటాక్ చేసి వైసీపీ ఈ పరిస్థితి తెచ్చుకుందన్నారు. ప్రజల…
Karnataka Elections: కర్ణాటక ఎన్నికల ఫలితాలకు మరికొన్ని గంటల సమయం ఉంది. రేపు మధ్యాహ్నం వరకు ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందో అనే స్పష్టత వస్తుంది. ఇదిలా ఉంటే తాము ఒంటరిగానే అధికారంలోకి వస్తామని మరోసారి ధీమా వ్యక్తం చేశారు కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్. పొత్తులపై ఊహాగానాలను తోసిపుచ్చారు. 224 మంది సభ్యుల అసెంబ్లీలో దాదాపు 150 సీట్లు గెలుస్తామని, మెజారిటీ మార్కు 113 కంటే ఎక్కువగా గెలుస్తామన్న పార్టీ అంచనాకు కట్టుబడి ఉన్నానని…
Niranjan Reddy: ఎలాంటి దాన్యం అయిన, ప్రతీ ధాన్యపు గింజ కొనాల్సిందేనని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని జిల్లా కలెక్టర్లకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు.
Errabelli: కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఏమి మాట్లాడుతారో వాళ్ళకే తెలియదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
Off The Record: కర్ణాటక ఎన్నికల ఫలితాల కోసం దేశమంతా ఆసక్తి గా ఎదురు చూస్తోంది. మరీ ముఖ్యంగా ఆ ప్రభావం తెలంగాణ మీద ఎక్కువగా ఉంటుందని అంచనాలు వేసుకుంటున్నారు ఇక్కడి కమలనాధులు. దాన్ని బట్టి రాజకీయ సమీకరణలు సైతం మారతాయన్న చర్చోపచర్చలు పార్టీలో జరుగుతున్నాయి. కన్నడ నాట గెలిస్తే తెలంగాణలో రెట్టించిన ఉత్సాహంతో పని చేయవచ్చని, ఓడితే మోరల్‌గా దెబ్బ పడుతుందని మాట్లాడుకుంటున్నారు టి బీజేపీ నాయకులు. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత తెలంగాణే అనుకుంటున్న తమకు…
Karnataka Elections: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మే 13న కన్నడ నాట ఎవరు అధికారం చేపడుతారో తేలబోతోంది. మెజారిటీ సర్వేలన్నీ కూడా కాంగ్రెస్ అధికారంకి వస్తుందని, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలుస్తుందని ప్రకటించాయి. ఒకటి రెండూ మాత్రమే బీజేపీ అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలతో కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ శ్రేణులు ఉత్సామాన్ని ఉద్దేశిస్తూ బీజేపీ నేత
The Kerala Story: దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టించిన ‘ది కేరళ స్టోరీ’ సినిమా కలెక్షన్లలో దూసుకుపోతోంది. ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలు సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చాయి. ఇదిలా ఉంటే తమిళనాడు, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాలు సినిమా ప్రదర్శనను బ్యాన్ చేశాయి. పలువురు సీఎంలు, మంత్రులు ఈ సినిమాను చూస్తున్నారు.
కనీసం 30-40 స్థానాలుంటేనే సీఎం అభ్యర్థిగా ఉంటామని అనగలం అన్నారు జనసేనాని.. మేం ఒక కులం కోసం పని చేసే పార్టీ కాదన్న ఆయన.. ముందస్తు ఎన్నికలు వస్తే జూన్ నుంచి క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేపడతామని ప్రకటించారు.. మా బలం మీదే ఆధారపడి సీట్ షేరింగ్ ఉంటుందని వెల్లడించారు. కొన్ని జిల్లాల్లో మా బలం ఎక్కువ.. కొన్ని జిల్లాల్లో తక్కువ.. కానీ, జనసేనకు పట్టున్న ప్రాంతాల్లో కచ్చితంగా పోటీ చేస్తామని తెలిపారు.