UP Local Body Elections: కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ దారుణ పరాజయాన్ని మూటకట్టుకుంది. అయితే ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి ఎదురులేకుండా పోయింది. ప్రతిపక్షంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) నామమాత్రపు ప్రభావాన్ని చూపింది. మే 4, 11 తేదీల్లో రెండు విడతలుగా ఉత్తరప్రదేశ్‌లోని పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 17 మేయర్ పదవులతో పాటు నగర పాలక పరిషత్‌లకు 198 మంది చైర్‌పర్సన్‌లు, 5,260 మంది సభ్యులు, నగర పంచాయతీలకు 542 మంది చైర్మన్‌లు, 7,104 మంది నగర పంచాయతీల సభ్యులను ఎన్నికలు జరిగాయి.
Read Also: Karnataka Election Results: బీజేపీని దెబ్బకొట్టిన లింగాయత్‌లు.. చివరి నిమిషంలో కమలం పాచిక పారలేదు..
ప్రస్తుతం మొత్తం 17 మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు 199 మున్సిపాలిటీల్లో 99 చోట్ల బీజేపీ, 38 చోట్ల ఎస్పీ, 4 చోట్ల కాంగ్రెస్, 18 చోట్ట బీఎస్పీ, ఇతరులు 40 చోట్ల ఆధిక్యం/విజయం సాధించారు. ఇక 544 నగర పంచాయతీల్లో 192 చోట్ల బీజేపీ, 83 చోట్ల ఎస్పీ, 7 చోట్ల కాంగ్రెస్, 42 చోట్ల బీఎస్పీ, 176 చోట్ల ఇతరులు ఆధిక్యం/ విజయం సాధించారు.
ఇదిలా ఉంటే బీజేపీ మిత్రపక్షం అప్నాదళ్ యూపీ బై ఎలక్షన్స్ లో సత్తా చాటింది. చన్‌బే నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్తి రింకీ కోల్ విజయం సాధించారు. 9,000 ఓట్ల మెజారిటీతో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి కీర్తి కోల్ పై ఘనవిజయం సాధించారు. మీర్జాపూర్ జిల్లాలో ఉండే చన్‌బే నియోజకవర్గంలో బీజేపీ వశం అయింది.