Leaders’ reaction to BJP’s defeat: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం దిశగా సాగుతోంది. 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ 113ని దాటి 137 స్థానాల్లో విజయం దాదాపుగా ఖరారు అయింది. బీజేపీ కేవలం 63 స్థానాలకు, జేడీఎస్ 20 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ వైఫల్యంపై మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ కీలక నేత బీఎస్ యడియూరప్ప కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Also: Minister Sudhakar : బ్రహ్మానందం ప్రచారం చేసిన ఓడిన మంత్రి సుధాకర్
బీజేపీ పార్టీకి గెలుపోటములు కొత్త కాదని, పరాజయంపై ఆత్మ పరిశీలన చేసుకుంటామని, పార్టీ కార్యకర్తలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, పార్టీ పరాజయానికి కారణాలను ఆత్మ పరిశీలన చేసుకుంటామని యడియూరప్ప అన్నారు. ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్లు వెల్లడించారు.
మేము అనుకున్న మార్క్ చేరుకోలేకపోయామని, జాతీయ పార్టీగా ఎక్కడ వైఫల్యం చెందామో అనే విషయాలను సమీక్షించుకుంటమని సీఎం బసవరాజ్ బొమ్మై అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, కార్యకర్తలు కష్టపడ్డప్పటికీ మేము అనుకున్న స్థానాలను సాధించలేదని, పూర్తి ఫలితాలు వచ్చిన తర్వాత సమీక్షించుకుంటామని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో భారీ విజయంతో తిరిగి వస్తామని బొమ్మై ధీమా వ్యక్తం చేశారు. ఈ ఓటమికి తాను బాధ్యత వహిస్తానని, ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు.