కర్ణాటకలో విజయం అనంతరం దేశంలో తమ సత్తా చాటేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. దేశంలో బీజేపీని గద్దె దించేందుకు తమ అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది చివరలో జరగనున్న మధ్యప్రదేశ్ ఎన్నికలకు ఇప్పటి నుంచి హామీల వర్షం కురిపించి ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది.
Komatireddy Raj Gopal Reddy: బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ కొనసాగుతారని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష పదవి కోసం ఎవ్వరూ లాబీయింగ్ చెయ్యడం లేదన్నారు.
Komatireddy Raj Gopal Reddy: పార్టీ మారుతున్నాని వస్తున్న వార్తలను బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఖండించారు. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత నేను ఎక్కడ ఈ మాటలు అన లేదని క్లారిటీ ఇచ్చారు. కర్ణాటక ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్న నా మిత్రులు నన్ను తిరిగి కాంగ్రెస్‌లోకి రమ్మని అడుగుతున్న మాట వాస్తవమే అని తెలిపారు.
Vishnuvardhan Reddy: మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి బహిరంగ సవాల్ విసిరారు బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రేపు గన్నవరం బస్టాండ్ దగ్గరకు వస్తే బహిరంగ చర్చకు సిద్ధం కావాలన్నారు.. ప్రజా చార్జిషీట్‌పై చర్చకు సిద్ధమా అంటూ చాలెంజ్ చేశారు.. మాజీమంత్రి కొడాలి నాని వచ్చినా.. కట్టకట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు వచ్చినా నేను రెడీ అన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చామని.. కనీసం గుడివాడలోనైన పూర్తయ్యాయని…
Etela Rajender: బీజేపీకి త్వరలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గుడ్ బై చెబుతున్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ వార్తలను ఈటల తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు తన సోషల్ మీడియాలో రెండు ట్వీట్ లు చేశారు. తను పార్టీలు మార్చే వ్యక్తిని కానని స్పష్టం చేశారు. తన అభిప్రాయం తెలుసుకోకుండా ఇలాంటి వార్తలు రాయడం తగదని మండిపడ్డారు. ప్రధాన మంత్రి మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షా…
JP Nadda: ఉచితాలపై బీజేపీ జాతీయాద్యక్షుడు జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో జపాన్, అమెరికా, చైనా దేశాలు ఉచితాలపై డబ్బులను ఖర్చు పెట్టాయని, ఇదే ఆ దేశాల్లో ఆర్థిక సంక్షోభానికి కారణం అయిందని అన్నారు. భారతదేశం మాత్రం రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిందని.. ఇది మౌళిక సదుపాయాలు, వ్యవసాయం, ఇతర సెక్టార్లకు బూస్ట్ ఇచ్చిందని ఆయన అన్నారు.
Karnataka: కర్ణాటకలో ఘన విజయం సాధించినా..కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయడానికి సతమతం అవుతోంది. పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ తో పాటు మాజీ సీఎం సిద్ధరామయ్య కూడా పదవిని ఆశిస్తుండటంతో అధిష్టానానికి తలనొప్పిగా మారింది. అయితే బుధవారం సీఎం ఎంపికపై కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సిద్ధరామయ్యతో పాటు డీకే శివకుమార్ తో రాహుల్ గాంధీ సమావేశం అయ్యారు. రాహుల్ గాంధీ హామీ మేరకు డీకే శివకుమార్ మెత్తబడినట్లు సమాచారం.
Bihar: బీహార్ లో జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) నాయకుడు ఏర్పాటు చేసిన పార్టీ వివాదాస్పదం అయింది. జేడీయూ అధ్యక్షుడు లాలన్ సింగ్ తన కార్యకర్తలకు మటన్ రైస్ తో విందు ఏర్పాటు చేశారు. ముంగేర్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం బీజేపీ నాయకుడు చేసిన విమర్శలు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. జేడీయూ అధ్యక్షుడు విందు ఏర్పాటు చేసిన తర్వాత నుంచి ఆ ప్రాంతంలో వందలాది కుక్కలు కనిపించడం లేదని బీజేపీ ఆరోపించారు.