Revanth Reddy: నేను లోక సభ ఎంపీ నీ.. నన్ను ఎందుకు అరవింద్ కుమార్ కలవడు? అంటూ టీ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అరవింద్ కుమార్ కేసీఅర్ , కేటీఆర్ లకు తాబేదారా ? అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఔటర్ రింగు రోడ్డు ను ముంబై కి చెందిన IRB సంస్థకు అమ్మారని ఆరోపించారు. టెండర్ల ప్రక్రియ మొదలు బిడ్ ఖరారు వరకు జరిగిన అక్రమాలను కాంగ్రెస్ పార్టీ చెబుతూ వచ్చిందని అన్నారు. టెండర్ సాధించిన వారికి లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ తర్వాత ముప్పై రోజుల్లో 10 శాతం చెల్లించాలని గుర్తు చేశారు. 738 కోట్ల రూపాయలను ముప్పై రోజుల్లో IRB సంస్థ HMDA కు చెల్లించాలని అన్నారు. ఇంకా 10 శాతం ఆ కాంట్రాక్టు సంస్థ చెల్లించలేదని, ఆ కాంట్రాక్ట్ సంస్థకు లాభం జరిగేలా అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు కేటీఆర్ అంటూ ఆరోపణలు గుప్పించారు. ఆ కాంట్రాక్ట్ సంస్థ ఆర్థికంగా బాగా ఉందని ఇప్పటి దాకా బుకాయించారు. నిధులు లేవు, ఆ కాంట్రాక్ట్ సంస్థ 120 రోజుల సమయం కోరిందని తీవ్ర ఆరోపణలు చేశారు. HMDA లో CE గా పని చేసి రిటైర్డ్ అయిన వ్యక్తినీ సంతకాలు పెట్టేందుకు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ LTD ఎండీ గా BLN రెడ్డీని తీసుకువచ్చారని తీవ్ర ఆరోపణలు చేశారు.
సంతోష్ అనే ఐఏఎస్ ఆఫీసర్ ను అక్కడ నుంచి హడావుడిగా బదిలీ చేశారని అన్నారు. IRB సంస్థ సింగపూర్ సంస్థకు 49 శాతం వాటా అమ్మారని కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ అక్రమ సంపాదనను విదేశాల్లో పెట్టుబడులు పెట్టుకోడానికి వెళ్ళారని తీవ్ర ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి. సింగపూర్ సంస్థ ఫ్రంట్ ఎండ్ లో ఉండి వాటా కొనుగోలు చేస్తుందని, ఈ కంపెనీ వెనుక షెల్ కంపెనీలు వస్తాయని అన్నారు. వీటి వెనుక ఉన్న రాజులు, యువ రాజులు ఎవరో బయటకు రావాలని వ్యంగాస్త్రం వేశారు. ఎల్లుండి లోపు IRB సంస్థ 10 శాతం HMDA కు చెల్లించాలని, లేకపోతే టెండర్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సోమేష్ కుమార్ ,అరవింద్ కుమార్ లు ఈ తతంగం అంతా నడిపిస్తున్నారని ఆరోపించారు. తను అడిగిన సమాచారం కేసీఅర్ ప్రభుత్వం ఇవ్వడం లేదని మండిపడ్డారు. అరవింద్ కుమార్, కేసీఅర్ , కేటీఆర్ లకు తాబేదారా ? అంటూ ప్రశ్నించారు. తనని ఎందుకు అరవింద్ కుమార్ కలవడు ? నేను లోక సభ ఎంపి నీ కదా అంటూ అన్నారు.
ఐఆర్‌బీ డెవలెప్పర్స్ పెట్టుకున్న లేఖ తెలంగాణ సర్కార్ లో వేగంగా నడుస్తుందని ఆరోపణలు గుప్పించారు. సోమేష్ కుమార్ అంతా జాగ్రత్తగా చేశామని చెప్పారని గుర్తు చేశారు. 10 శాతం చెల్లించలేని ఐఆర్‌బీ డెవలెప్పర్స్ కు ORR ను ఎలా కట్టబెడతారు? అంటూ ప్రశ్నించారు. ORR టెండర్ ను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని అన్నారు. RTI కింద సమాచారం ఇవ్వకపోతే HMDA ,HGC ఆఫీసులను దిగ్బంధం చేస్తామన్నారు. ORR టెండర్ పై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామన్నారు. ORR పై బీజేపీ ఎందుకు మాట్లాడదు ? బండి సంజయ్ ORR అవినీతి పై ఎందుకు మాట్లాడరు ? అని రేవంత్ ప్రశ్నించారు. ఏప్రిల్ 27 న IRB సంస్థకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ లేఖ ఇచ్చారు.. మే 26 లోపు 10 శాతం చెల్లించాలని చెప్పారని అన్నారు. 120 రోజుల తర్వాత ఐఆర్‌బీ డెవలెప్పర్స్ 10 శాతం కట్టేలా వెసుల బాటు కల్పించేందుకు పైల్ నడుస్తుందని ఆరోపణలు చేశారు. కానీ 10 శాతం చెల్లించలేని సంస్థకు లక్ష కోట్ల రూపాయల విలువైన ORR ను అప్పగించింది కేసీఅర్ సర్కార్ అంటూ మండిపడ్డారు.
ఐఆర్‌బీ డెవలెప్పర్స్ డిఫాల్ట్ కంపెనీ, సీబీఐ ,NCLT కేసులు ఉన్నాయని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటే.. వేరు వేరుగా చూడవద్దని సంచల వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ మీద భ్రమలు వద్దు, మోడీ తోనే కేసీఅర్ ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ క్యాబినెట్ లో దొంగలు ఉన్నారు, దోపిడీ చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ UK పర్యటనలో ఉన్నప్పుడు ఉన్న రాజులు ఎవరో బయటపెట్టాలి? అని రేవంత్ అన్నారు. మా పార్టీ అధ్యక్షుడు మార్పు విషయంలో గతంలోనే వార్తలు వచ్చాయని గుర్తు చేశారు. ఎలక్షన్ దగ్గర ఉన్న ఈ సమయంలో మార్పులు ఉండకపోవచ్చని ధీమా వ్యక్తం చేశారు. తనను ఎలా వాడుకోవలో అని అధిష్టానం ఆలోచిస్తుందని అన్నారు. పార్టీలో ఉన్న పాత వారికి, ఇతర పార్టీల నుంచి వచ్చిన కొత్త వారికి ఘర్షణ వాతావరణం ఉండడం సహజమన్నారు. పాత కొత్త అని బేదం ఉండకూడదని అధిష్టానమే చెబుతోందని గుర్తు చేశారు. ప్రజా క్షేత్రంలో పేరున్న వారికే టికెట్లు వస్తాయని రేవంత్ అన్నారు.
CM Jagan: ఒక్క జగన్‌పై తోడేళ్లంతా కలిసి వస్తున్నారు.. నాకు అండగా ఉండండి