Air travel for pilgrims: సీనియర్ సిటిజన్లకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ తీసుకువచ్చింది. తీర్థయాత్రలకు వెళ్లే వారి కోసం విమాన సౌకర్యాన్ని కల్పించింది. దానికి అవసరమయ్యే నిధులను కూడా ప్రభుత్వమే సమకూర్చనుంది. ఇలా తీర్థయాత్రలకు వెళ్లే సీనియర్ సిటిజన్లకు సౌకర్యం కలిపించిన తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది. ఆ
Vishnu Kumar Raju: సర్క్యూలేషన్ లో వున్న రూ.2 వేల నోటును ఉపసంహంచుకుంటున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది.. దీంతో, సామాన్యుల్లో గందరగోళం మొదలైంది. 2 వేల నోట్లు బ్యాంకులకు ఇస్తే ఏమవుతుందోనంటూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. అసలు.. ఇది ఎవరికి లాభం..? మరెవరికి నష్టం? అనే చర్చ సాగుతోంది.. అయితే.. ఈ వ్యవహారంపై స్పందించిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు.. డబ్బులు ఆశ చూపించి ఓట్లు కొనుక్కుందామని చూసే పార్టీలకు నోట్ల రద్దుతో గుండెల్లో రైళ్లు పరుగేడుతున్నాయన్నారు.. ఓటింగ్…
K.Annamalai : తమిళనాడు బీజేపీ చీఫ్ కె. అన్నామలై మరోసారి అధికార డీఎంకేను టార్గెట్ చేశారు. తమిళనాడులో రూ.2000 నోట్ల లావాదేవీలను ట్రాక్ చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు.
Rajasthan: అవినీతి అధికారులు, అవినీతి డబ్బును దాచేందుకు ఏకంగా ప్రభుత్వ భవనాన్నే వాడకున్నారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. రాజధాని జైపూర్ నగరంలోని యోజన భవన్‌లోని బేస్మెంట్లో తాళం వేసి ఉన్న అల్మారా నుంచి ₹ 2.31 కోట్ల నగదు, కిలో బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ బేస్మెంట్లోకి తరుచుగా వెళ్లే ఏడుగురు ప్రభుత్వ అధికారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. దళితులు, గిరిజనులు సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలను ఆపండి అంటూ అందులో పేర్కొన్నారు.
Somu Veerraju: గన్నవరంలో ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి.. ఛార్జ్ షీట్ కార్యక్రమం అమలుపై సమీక్ష జరుగుతోంది.. నేతల పనితీరుపై చర్చ ఉండగా.. పొత్తులపై పవన్ ప్రకటన, సొంత పార్టీ నేతల కామెంట్లపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.. అయితే, ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఇవాళ పొత్తులపై చర్చ లేదు.. అధిష్టానానికి అన్నీ వివరించామని స్పష్టం చేశారు.. బీజేపీ, టీడీపీ, జనసేన…
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి సుభాష్ మహరియా కాంగ్రెస్‌ను వీడి నేడు బీజేపీలో చేరే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సుభాష్ మహరియా ప్రకటించారు.
గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలోని సావర్కుండ్లా పట్టణం సమీపంలో ఆయన నడుపుతున్న కారు బుల్డోజర్ను ఢీకొనడంతో గుజరాత్ మాజీ వ్యవసాయ మంత్రి వల్లభ్‌భాయ్ వాఘాసియా మరణించినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ రాష్ట్రంలో మదర్సాలపై అణిచివేతను కొనసాగిస్తానని తన ప్రతిజ్ఞను పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో మరో 300 మదర్సాలు మూసివేయబడతాయని గురువారం చెప్పారు.