CPI Narayana: మోడీకి అభివృద్ధిపై ఫోకస్ లేదని.. ఆయనకు ఉన్నదల్లా అవినీతిపై మాత్రమే దృష్టి ఉందని సీపీఐ నారాయణ ఆరోపించారు. మోడీనే అసలుసిసలైన ఆర్థిక నేరస్తుడన్నారు. బీజేపీ అవినీతి పాలన చూడలేకే కర్ణాటకలో బీజేపీకి ప్రజలు స్వస్తిపలికారన్నారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించిందని సీపీఐ నారాయణ తెలిపారు. సోమవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. కర్ణాటక తరహా గెలుపు ఇతర రాష్ట్రాలలో మొదలవుతుందన్నారు. ఈ ఫలితం ప్రభావం దేశంలోని అన్ని రాష్ట్రాలను ప్రభావితం చేస్తుందని నారాయణ జోష్యం చెప్పారు.
Read Also: Sumanth Prabhas: సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ‘మేమ్ ఫేమస్’!
దేశ ఐక్యత కోసం ఇందిరా గాంధీ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారన్నారు. ఆ కుటుంబంపై ప్రస్తుతం మోడీ కక్ష సాధిస్తున్నారన్నారు. రూ. 2 వేల నోట్లు ఉపసంహరణ వెనక దురుద్దేశం ఉందని సీపీఐ నారాయణ భావించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘‘రూ. 2 వేలు నోట్లను ఉపసంహరించి దొంగలను దొరలుగా చేశారు. నోట్లు మార్చుకునేందుకు ఎందుకు 4 నెలలు సమయం ఇచ్చారు? అంటే నోట్ల కట్టలు బీరువాలో దాచుకున్నవారు దర్జాగా పర్సంటేజ్ కి మార్చుకుంటారు. అలా వచ్చిన డబ్బుని బీజేపీ ఎన్నికలలో ఖర్చు చెయ్యబోతోందని నారాయణ అన్నారు. దేశంలో పొలిటికల్ పొలరైజేషన్ వచ్చింది. మోడీనీ దించడానికి అన్ని రాజకీయ పక్షాలు ఏకం అవుతున్నాయి. ఏపీకి జగన్ కన్న మోదీ ఎక్కువ ద్రోహం చేశాడు. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చెయ్యడానికి సిద్ధం అవుతున్నాయి. ఏ కూటమి వచ్చినా రాష్ట్రంలో లాభం ఉండదు. బీజేపీ వ్యతిరేక ఓటు వైసీపీకి పడుతుంది. అప్పుడు మళ్ళీ జగన్ గెలుస్తాడు’’ అని నారాయణ పేర్కొన్నారు.
Read Also: BRO: నిన్న మామ.. నేడు అల్లుడు.. ఈ స్పీడ్ మాములుగా లేదు ‘బ్రో’