Karnataka: కాంగ్రెస్ హామీ ఇచ్చింది.. కరెంట్ బిల్లులు కట్టం, బస్సులో టికెట్ తీసుకోం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల కోసం ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 224 సీట్లకు గానూ 135 స్థానాల్లో జయకేతనం ఎగరేసింది. అయితే ఈ గెలుపులో కాంగ్రెస్ ప్రకటించిన 5 హామీలు చాలా కీలకంగా మారాయి. 200 యూనిట్లలోపు విద్యుత్ ఉచితంతో పాటు, ప్రభుత్వ రవాణా వ్యవస్థలో మహిళలకు ఉచితంగా ప్రయాణం వంటి హామీలు ఉన్నాయి. అయితే కాంగ్రెస్ గెలిచినప్పటి నుంచి ప్రజలు ఈ హామీల కోసం డిమాండ్ చేస్తున్నారు.
Read Also: AI face-swapping: AI ఫేస్-స్వాపింగ్ టెక్నాలజీతో భారీ మోసం.. స్నేహితుడిలా నటించి రూ.5 కోట్లకు టోకరా..
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
- LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
- Rahul Gandhi's SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
గ్రామాల్లో కరెంట్ బిల్లుల వసూలు చేసేందుకు వచ్చే విద్యుత్ అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. మాకు కాంగ్రెస్ హామీ ఇచ్చింది, వారే మా బిల్లులు కడుతారని ప్రజలు చెబుతున్నారు. బెళగావిలోని ఓ గ్రామంలో కొందరు వ్యక్తులు కరెంటు బిల్లులు చెల్లించేందుకు నిరాకరించారు. కాంగ్రెస్ ఉచిత కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చిందని ప్రజలు చెబుతున్నారు. కొప్పల్, కలబురగి, చిత్రదుర్గ జిల్లాల్లోని గ్రామస్థులు కూడా విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు నిరాకరించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే కొప్పల్ ప్రాంతంలో గత 6 నెలలుగా రూ.9000 విద్యుత్ బిల్లు కట్టాలని కోరిన విద్యుత్ ఉద్యోగులపై ఆ వ్యక్తి దాడి చేశాడు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇదిలా ఉంటే రాయచూర్ లో ఓ మహిళ బస్సులో టికెట్ తీసుకునేందుకు నిరాకరించింది. టికెట్ కోసం డబ్బులు ఇవ్వకపోవడంతో సదరు మహిళ బస్సు కండక్టర్‌తో వాగ్వాదానికి దిగింది. బస్సు టికెట్ కొనడానికి నిరాకరించిన మహిళ.. మేము డబ్బులు చెల్లించాల్సి వస్తే కాంగ్రెస్ ఎందుకు ఉచితం అని ప్రకటించింది..? అని ప్రశ్నించింది. మస్కీ-సింథనూర్ బస్సులో ఈ ఘటన జరిగింది. కాంగ్రెస్ ప్రకటించిన హామీలను అమలు చేస్తే ఏటా రూ.50,000 కోట్ల ఖజానాకు బొక్కపడుతుంది.
Women strongly argues with bus conductor in Karnataka, says she will not buy ticket.
"If we have to pay money, why did they announce its free, are they mad".pic.twitter.com/WyLhF4XRuj— Dr AishwaryaS (@Aish17aer) May 23, 2023
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?