తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతినీ ప్రశ్నించకుండ ఉండడానికి ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ మానవ హక్కులు కమిషన్ కమిషనర్ లేకుండా చేశారంటూ ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. రాష్ట్రంలో ధరణి పోర్టల్ తీసుకు వచ్చి మా చారిటీ భూములను ఆగం చేశారు.. నన్ను తిట్టిన జస్టిస్ ఉజ్జల్ భూయన్ ట్రాన్స్ ఫర్ అయ్యాడు అంటూ ఆయన వ్యాఖ్యనించాడు.
Also Read: Salaar: మైండ్ బ్లాకయ్యేలా సలార్ తెలుగు హక్కుల రేట్లు
ప్రగతిభవన్ లో కేసీఆర్ ను కలవడానికి వెళితే నన్ను అడ్డుకున్నారు… కేసీఆర్ అవినీతి మీద నేను ప్రశ్నిస్తానని భయపడి నన్ను కలవలేదు కేఏ పాల్ అన్నాడు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మూడు పార్టీలు ఒక్కటే అని ఆయన కామెంట్స్ చేశారు. కేసీఆర్ మిత్రుడే కిషన్ రెడ్డి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడు అని ఆయన అన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు నేను పేద ప్రజల కోసం పోరాటం చేస్తున్నాను.. కాబట్టి నన్ను వాళ్లకు ప్రధాన ప్రతి పక్షం అంటున్నారు.
Also Read: Revanth Reddy: అధికారంలోకి వచ్చాక ధరణి పోర్టల్ తీసేస్తామంటే ఏడుస్తున్నారు..
నేను అధికారంలోకి రాగానే అందరికీ డబుల్ బెడ్ రూమ్ లు ఇస్తాను అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. నా డబ్బు అంత అమెరికాలో ఉంది ఆ డబ్బు తీసుకు వచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తాను.. 6 నెలలుగా మానవ హక్కుల కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఖాళీగా ఉంది.. వారం రోజుల్లో మానవ హక్కుల కమిషన్, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్లను నియమించాలి అని ఆయన డిమాండ్ చేశారు.
Also Read: Breastfeeding: తల్లికి షుగర్ ఉంటే బిడ్డకు పాలు ఇవ్వొచ్చా?
జస్టిస్ చంద్రకుమార్ ను మానవ హక్కుల కమిషన్ గా ఉండండి..మీ పేరు రిక మెండ్ చేస్తాను అని కేఏ పాల్ అన్నారు. మీరు మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా ఉంటారా..(లైవ్ లో జస్టిస్ చంద్ర కుమార్ కు ఫోన్ చేసి అడిగిన ka పాల్.) అంటూ ఆయన వ్యాఖ్యనించారు. వెంటనే సదాశివపేట పోలీస్ ను సస్పెండ్ చేయాలని మానవ హక్కుల కమిషన్ ఆఫీస్ లో ఫిర్యాదు చేసాను అని కేఏ పాల్ అన్నారు.