BJP Meeting: బీజేపీ వివిధ రాష్ట్రాల్లో పార్టీ ఉనికిని బలోపేతం చేయడానికి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా నివాసంలో కోర్ గ్రూప్ సమావేశాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.
Special Focus On Telangana: తెలంగాణలో జంపింగ్ సీజన్ మొదలైంది. ఎలక్షన్ షెడ్యూల్ కు ముందే వలసల పర్వం షురూ అయింది.టికెట్ల కేటాయింపు ఖరారు వచ్చేసరికి ఇది మరింత పెరిగింది.చివరి నిమిషం దాకా టికెట్ కోసం ప్రయత్నాలు చేసి..రాదని తెలిసిన వెంటనే కండువా మార్చేస్తున్నారు. కొందరు వెయిట్ చేస్తూనే..ప్రత్యర్థి పార్టీలో కర్చీఫ్ వేస్తున్నారు. టికెట్ కోసం గోడ దూకేందుకు సై అంటున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో జంపింగ్ జిలానీల సీజన్ ఊపందుకుంది టికెట్ కోసం ఎవరికి వారు తీవ్ర…
Off The Record: ఓవైపు బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన అయిపోయింది. మరోవైపు కాంగ్రెస్ 55 మందితో ఫస్ట్ లిస్ట్ ప్రకటించేసింది. ఇప్పటికే ప్రచారంగంలోకి దూకేశారు రెండు పార్టీల అభ్యర్థులు. కానీ… బీజేపీ మాత్రం ఇంకా తమ జాబితాను బయటపెట్టలేదు. దీంతో ఆశావహుల పల్స్ రేట్ అంతకంతకూ పెరిగిపోతోందట. ఇతర పార్టీల అభ్యర్థులు ఫీల్డ్లో ఉంటే … తాము వెనకబడిపోతామేమోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కమలం పార్టీ లీడర్స్. పితృపక్షం ముగిసిన వెంటనే మొదటి జాబితా వస్తుందని ప్రచారం…
Udaynidhi Stalin: సనాతన ధర్మంపై వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు పాలైన ఉదయనిధి స్టాలిన్ మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. శనివారం అహ్మదాబాద్ వేదికగా ఇండియా-పాకిస్తాన్ వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో పాకిస్తాన్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ ఔటై వెళ్తున్న క్రమంలో స్టేడియంలోని ప్రేక్షకులు ఒక్కసారిగా ‘జైశ్రీరాం’ నినాదాలు చేశారు. అయితే దీనిపై మాట్లాడిన డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్.. జైశ్రీరాం నినాదాలను ఖండించారు.
సభలకు హాజరవుతున్న ప్రజలను చూస్తుంటే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని స్పష్టమవుతోందని కేంద్ర మంత్రి రాజనాథ్ సింగ్ అన్నారు. మహేశ్వరంలో జరిగిన బీజేపీ ఎన్నికల సభలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు పాల్గొన్నారు.
తెలంగాణ రావడంలో కీలకంగా రాజ్ నాథ్ సింగ్ వ్యవహరించారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇవాళ బీజేపీ మహేశ్వరంలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభ కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. breaking news, latest news, telugu news, cm kcr, kishan reddy, bjp,
Amit Shah: వచ్చే నెలలో 5 రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. 2024 లోక్సభ ఎన్నికల ముందు ఈ అసెంబ్లీ ఎన్నికలు ఇటు బీజేపీకి, అటు కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకంగా మారాయి. దీంతో పార్టీల అగ్రనేతలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఇదిలా ఉంటే సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పర్యటించారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బుజ్జగింపులు మొదలుపెడుతుందని ఆరోపించారు.
Mahua Moitra: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన ఆరోపణలు చేశారు. లోక్సభలో చర్చల సమయంలో ప్రశ్నించడానికి ఓ వ్యాపారవేత్త నుంచి భారీగా డబ్బులు తీసుకున్నారని ఆరోపిస్తూ నిన్న లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు దూబే ఉత్తరం రాశారు. వ్యాపారవేత్త దర్శన్ హీరానందనీ,
బీజేపీకి తెలంగాణ అండగా ఉందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ అవినీతిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని విమర్శలు గుప్పించారు. కుటుంబ పాలనను తెలంగాణ ప్రజలు అంగీకరించే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు.