Manda Krishna Madiga: నవంబర్ 30 లోపు sc వర్గీకరణ విషయం తేల్చాలని.. సమస్య పరిష్కారానికి ఎవ్వరూ చొరవ తీసుకుంటారో వారికి మద్దతు ఉంటుందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడ మంద కృష్ణ మాదిగ అన్నారు. మంచిర్యాల జిల్లాలో మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ.. మా సమస్య ను పట్టించుకోని వారిని మా ప్రజల్లో ఎండకడుతామన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. మోడీ ప్రధాని అయినప్పటికీ నుండి ఎన్నో బిల్లులు పాస్ అయ్యాయని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును బీజేపీ నవంబర్ లో జరిగే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం లోని బీజేపీ నాయకులు ఎస్టీ వర్గీకరణ బిల్లు పెట్టించాలని, కాంగ్రెస్ ఎస్టీ వర్గీకరణ పై చిత్తశుద్ది ప్రకటించాలని తెలిపారు. కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు బిల్లు పెట్టలేదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బిల్లు పెట్టమని అదికార పార్టి పై ఒత్తిడి చేయలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలు ప్రధానికి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖార్గే లేఖలు రాయాలన్నారు. డిక్లరేషన్ లో పెట్టడం కాదన్నారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఎస్టీ వర్గీకరణ విషయంలో చొరవ తీసుకోవాలన్నారు. కేసిఆర్ పాలనలో మాదిగలకు అవమానాలు, అణచివేతలు జరుగుతున్నాయని తెలిపారు. నిండు అసెంబ్లీ కేంద్రం వద్దకు అఖిల పక్షాన్ని తీసుకుపోతమన్నరని అన్నారు. ఇప్పుడు ప్రధాన మంత్రి వద్దకు అఖిల పక్షాన్ని తీసుకోవాలని తెలిపారు. లేని పక్షంలో ప్రజా క్షేత్రంలో బుద్ది చెప్పుతామని అన్నారు.
నవంబర్ మొదటి వారంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయని, అప్పటి వరకు ఎస్టీ వర్గీకరణ బిల్లు పెట్టాలని కోరారు. ఎస్టీ వర్గీకరణ కాకపోతే మనకు ఒరిగేది ఏమీలేదన్నారు. విశ్వరూప మహా సభకు ప్రతి ఇంటి నుండి అందరు స్వచ్ఛందంగా రావాలని పిలుపు నిచ్చారు. ఇది ఎన్నిక సమయం, మాదిగలకు మా వాట ప్రకారం సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. 19 ఎస్టీ రిజర్డ్ నియోజకవర్గాలలో 14కు తగ్గకుండా సీట్లు కేటాయించాలని కోరారు. కేసీఅర్ మాదిగలకు అన్యాయం చేస్తున్నారని తెలిపారు. దీనికి నల్లాల ఓదెలు లే ఉదాహరణ అన్నారు. 70 శాతం ప్రజా ఆదరణ పొందిన ఓదెలు బలి పశువు చేశారని అన్నారు. డాక్టర్ రాజయ్యను టికెట్ ఇవ్వకుండా చేశాడు, మధిరలో మా మాదిగ బిడ్డకు టికెట్ ఇవ్వలేదు, మాకు రావాలసింది కదా? అని ప్రశ్నించారు. మంత్రి వర్గంలో మాకు స్థానం లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ లో మాకు గాడ్ ఫాదర్ లు లేరు, మంచిర్యాల జిల్లా పరిధిలో రెండు సీట్లు మాదిగలకు రావాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాలో మాదిగలు మెజారిటీ, పొత్తుల్లో బెల్లంపల్లి సీపీఐ పార్టీకి ఇవ్వాలని కోరారు. సీపీఐకి బెల్లంపల్లి లే కోరుకోవాలన్నారు. చెన్నూర్ కొరుకోకుడదని, కాంగ్రెస్ లో నల్లాల ఓదెలు, డాక్టర్ దాసరపు శ్రీనివాస్, రాధిక ఉన్నరని తెలిపారు. బీఆర్ఎస్ లో ఉండే కాంగ్రెస్ కోవర్టులు నల్లాలఓదెలు కు టికెట్ రాకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నూరులో మాదిగలకు టిక్కెట్ రాకుండా చేస్తే.. వారిని ఒడిస్తామని, మాకు అన్యాయం చేసిన పార్టీని మాదిగ పల్లెలో రాకుండ చేస్తామని స్పష్టం చేశారు.
Leo: రెండో రోజు వంద కోట్ల డ్రాప్… మండేకి పరిస్థితి ఏంటి?