ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ. శుక్రవారం ఏపీలోని విజయవాడ, గుంటూరు జిల్లాలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా విజయాడ ఓల్డ్ జీజీహెచ్‌లో క్రిటికల్ కేర్ బ్లాక్, బీఎస్ఎల్-3 ల్యాబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన అమరావతిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. ‘ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. ఏపీలో…
మేం జనసేనతో పొత్తులో ఉన్నాం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా అదే చెబుతున్నారని మరోసారి క్లారిటీ ఇచ్చారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. కానీ, తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయం కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుందన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహకారం అందించడం లేదని అపవాదు వేస్తున్నారు.. మోడీ సర్కార్ భాగ్యస్వామ్యం లేకుండా రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరగడం లేదు అని ఆమె అన్నారు.
రాష్ట్ర పార్టీ సీనియర్ నేతల మధ్య కొనసాగుతున్న విభేదాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా .. అంతర్గత కలహాలను దూరం చేసి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. గురువారం పార్టీ సీనియర్ నేతలతో విడివిడిగా సమావేశమైన షా, అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ విభేదాల వల్ల పార్టీకి భారీగా నష్టం వాటిల్లిందని, రాబోయే కాలంలో మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్నందున వారి ప్రవర్తనను తట్టుకోడానికి పార్టీ సిద్ధంగా లేదని నేతలతో…
లోక్ సభ ఎన్నికలకు అమిత్ షా శంఖారావం పూరించారన్నారు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.., బీఅర్ఎస్ చిత్తుగా ఓడటం వల్లే కాంగ్రెస్ గెలిచిందన్నారు. ఒక్క ఎమ్మెల్యే నుంచి 8మంది ఎమ్మెల్యే లు గెలవడంతో అసలు విజయం బీజేపీదేనని ఆయన వ్యాఖ్యానించారు. బీఅర్ఎస్, కేసీఆర్ పట్ల తెలంగాణ ప్రజలు విసిగి పోయారని, అందుకే ఇది కాంగ్రెస్ గెలుపు కాదన్నారు. కేసీఆర్ కుటుంబం ఆస్తులు పెంచుకొని రాష్ట్రానికి అప్పులు పెంచిందని ఆయన ఆరోపించారు. బీఅర్ఎస్ నాయకుల…
రాజస్థాన్ ప్రభుత్వం నూతన సంవత్సర కానుక ఇచ్చింది. జనవరి 1 నుండి ఉజ్వల గ్యాస్ సిలిండర్ రూ.450కు అందించనుంది. రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా.. బిజెపి మేనిఫెస్టోలోని అన్ని హామీలలో ఉజ్వల పథకం లబ్ధిదారులకు 450 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు. పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన వాగ్దానాలన్నింటినీ మోడీ హామీలుగా ప్రచారం చేసింది. ఇప్పుడు దీనిని నెరవేరుస్తూ ఉజ్వల పథకం లబ్ధిదారుల కోసం బీజేపీ ఈ ప్రకటన చేసింది.
వచ్చే ఎన్నికల్లో మా వ్యూహం మాకు ఉంటుంది.. కేంద్ర అధిష్టానం ఎక్కడినుండి పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడి నుండి పోటీ చేస్తానని ప్రకటించారు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి..
త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. డిసెంబర్ 28న ఆయన రంగారెడ్డి జిల్లా కొంగర్ కలాన్‌లో పార్లమెంట్ ఎన్నికలపై అమిత్ షా సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణలో ఈసారి ఎలాగైనా ఎక్కువ స్థానాలను గెలిపించుకోవడమే లక్ష్యంగా బీజేపీ కేంద్ర నాయకత్వం పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే కేడర్‌కి లోక్‌సభ ఎన్నికలపై అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ పర్యటనలో భాగంగా చార్మినార్, భాగ్యలక్ష్మీ అమ్మవారికి అమిత్ షా ప్రత్యేకపూజలు…