BJP: వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ సిద్ధమవుతోంది. మూడోసారి వరసగా అధికారంలోకి వచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 50 శాతం ఓట్లను పొందడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే తన పార్టీ కార్యకర్తలకు, నేతలకు దిశానిర్దేశం చేసింది. జనవరి 22, 2024లో అయోధ్యంలో భవ్య రామమందిర ప్రారంభోత్సవం జరగబోతోంది. మోడీ హయాంలో ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ నెరవేరబోతోంది. అయితే అయోధ్య రామమందిర ప్రతిష్టాపనను సద్వినియోగం చేసుకోవాలని పార్టీ, కార్యకర్తలను కోరింది.
ఈ ఘటనపై ఆర్జేడీ అధికార ప్రతినిధి ఎజాజ్ అహ్మద్ మాట్లాడుతూ.. ఈ ఘటన బాధాకరమని, కాల్పులు జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్జేడీ-జేడీయూ ప్రభుత్వం నేరాలను సహించదని, దోషులను కటకటాల వెనకకి పంపుతామని అన్నారు. మరోవైపు బీజేపీ ఈ ఘటనపై ప్రభుత్వాన్ని విమర్శిస్తోంది.
బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. పొత్తుల అంశం బీజేపీ జాతీయ పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్న ఆయన.. ఎన్నికల సందర్భంలో పొత్తులపై నిర్ణయం ఉంటుందన్నారు.. అధికార పార్టీ నేతలు మాపై ఆరోపణలు చేయడం సబబు కాదని హితవుపలికారు. ఏదేమైనా బీజేపీ నిర్ణయం లేటైనా లేటెస్ట్ గా ఉంటుందని చెప్పుకొచ్చారు
Hijab: హిజాబ్ అంశం మరోసారి కర్ణాటకలో వివాదాస్పదం అవుతోంది. గతంలో బీజేపీ ప్రభుత్వం విద్యాలయాల్లో హిజాబ్ని నిషేధించింది. ఈ నిర్ణయాన్ని కర్ణాటక హైకోర్టు కూడా సమర్థించింది. ఇదిలా ఉంటే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం హిజాబ్ బ్యాన్ ఎత్తేస్తున్నట్లు వార్తలు వస్తోన్నాయి. నిన్న సీఎం సిద్ధరామయ్య మైసూరులోని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..మహిళలు కావాలంటే హిజాబ్ ధరించవచ్చని అన్నారు. ఈ వ్యాఖ్యలతో విద్యాలయాల్లో కూడా హిజాబ్ బ్యాన్ ఎత్తేస్తున్నారంటూ ఊహాగానాలు వెలువడ్డాయి.
Shivraj Singh Chouhan: ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో ఘన విజయం సాధించింది. ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలను కాంగ్రెస్ నుంచి గెలుచుకోగా.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అధికారం నిలుపుకుంది. కేవలం తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ గెలుపొందింది. అయితే ఈ మూడు రాష్ట్రాల్లో కూడా బీజేపీ మాజీ సీఎంలను కాదని కొత్త ముఖాలను సీఎంలుగా ఎన్నుకుంది.
BJP: బీహార్ రాజకీయంలో కేంద్రమంత్రి, బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ పార్టీ జేడీయూ, లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జేడీలు త్వరలో విలీనం అవుతాయంటూ కేంద్రమంత్రి శనివారం వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.
పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ తీరుపై మండిపడ్డారు. ‘భారతదేశ చరిత్రలో ఇంత మంది ఎంపీలను సస్పెండ్ చేసిన ఘటన ఎప్పుడూ జరగలేదు. వారు చేసిన తప్పేంటి? అని ప్రశ్నించారు. పార్లమెంట్ పై దాడి ఘటనపై చర్చకు పట్టుబట్టారు. ఒకవేళ ఏదైనా జరిగితే సభ్యులు చనిపోయేవారు కదా? బీజేపీ ఎంపీ పాస్ ఇవ్వడం నిజమా కాదా? పొరపాటున ఏ MIM ఎంపీ ఇచ్చి ఉంటే ఏం…
Hijab ban row: కర్ణాటకలో మరోసారి హిజాబ్ వివాదం రాజుకుంది. బీజేపీ హయాంలో పాఠశాలల్లో విద్యార్థులంతా ఒకే దుస్తులు ధరించాలని, హిబాబ్పై బ్యాన్ విధించింది. దీనిపై కర్ణాటక హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేయగా.. కోర్టు కూడా హిజాబ్ అనేది ముస్లిం ఆచారాల్లో తప్పనిసరి ఆచారం కాదని, విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని సమర్థించింది. ఇదిలా ఉంటే తాజాగా కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, హిజాబ్ బ్యాన్ని ఎత్తేసింది.
Hijab: గతేడాది కర్ణాటకలో హిజాబ్ అంశం రాజకీయంగా పెద్ద దుమారమే రేపింది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఈ వివాదం రాజకీయ విమర్శలకు దారి తీసింది. పాఠశాల్లలో హిజాబ్ ధరించడాన్ని వ్యతిరేకిస్తూ, దానిపై అప్పటి బీజేపీ సర్కార్ నిషేధం విధించింది. ఇదే అంశాన్ని కర్ణాటక హైకోర్టు కూడా సమర్థించింది.