రామ మందిర ఘనత భారతీయ జనతా పార్టీదేనని కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి ఎద్దేవా చేశారు. బీజేపీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ‘రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు రామమందిరం తాళం తెరిచేందుకు చర్యలు తీసుకున్నారు అనే విషయాన్ని గుర్తు చేశారు. ఈ బీజేపీ వాళ్ళు అబద్దాలు, తప్పుడు ప్రచారాలు తప్ప మరో పని లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 1985లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అయోధ్యలోని అప్పటి బాబ్రీ మసీదు తాళాలను తెరిచిన విషయాన్ని రామలింగారెడ్డి రెడ్డి ప్రస్తావించారు. మేము హిందూ మతాన్ని రాజకీయాలతో తీసుకురామన్నారు. ఈ బీజేపీ వాళ్ళు రాజకీయాలను హిందూ మతంతో పాటు ఆ శ్రీరాముడిని రాజకీయాల్లోకి తీసుకువస్తున్నారు అని ఎద్దేవా చేశారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు మేము చేయమని మంత్రి రామలింగారెడ్డి చెప్పుకొచ్చారు.
Read Also: Yash Birthday: హీరో యశ్ పుట్టినరోజు వేడుకల్లో విషాదం.. ముగ్గురు అభిమానులు మృతి!
కాగా, ఈ నెల 22న అయోధ్యలో రామమందిరం ‘ప్రాణ్‌ప్రతిష్ఠ’ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించాలని 34,000 ఆలయాలకు సర్క్యులర్ జారీ చేశారు. దీంతో పాటు రామమందిరం ప్రాణ ప్రతిష్ఠకు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. శ్రీ రామ జన్మభూమి తీరథ్ క్షేత్ర ట్రస్ట్ జనవరి 22 మధ్యాహ్నం రామాలయంలోని గర్భగుడిలో రామ్ లాలాను ప్రతిష్టించాలని నిర్ణయించింది. మహా మందిరంలో రాంలాలా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు.
Read Also: Naa Saami Ranga : దుమ్ము దుకాణం అంటున్న నాగార్జున.. కొత్త సాంగ్ ప్రోమో రిలీజ్..
ఈ కార్యక్రమానికి నటులు రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, అనుపమ్ ఖేర్, అక్షయ్ కుమార్ తో పాటు ప్రముఖ దర్శకులు సుభాష్ ఘాయ్, రాజ్‌కుమార్ హిరానీ, సంజయ్ లీలా భన్సాలీతో పాటు రోహిత్ శెట్టి, నిర్మాత మహావీర్ జైన్‌లకు ట్రస్ట్ ఆహ్వానాలు పంపింది. దీంతో పాటు దక్షిణ భారత సినీ ప్రముఖులు చిరంజీవి, మోహన్‌లాల్, ధనుష్ లకు కూడా ఆహ్వానం అందింది. ఈ వేడుకకు అన్ని వర్గాలకు చెందిన 4,000 మంది సాధువులను కూడా శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఆహ్వానించింది.
Read Also: ACC Deal: మరో సిమెంట్ కంపెనీని కొనేస్తున్న అదానీ గ్రూప్
అలాగే, అయోధ్యలో రామ్ లల్లా యొక్క ప్రతిష్ఠాపన వేడుకకు సంబంధించిన వైదిక ఆచారాలు ప్రధాన వేడుక జనవరి 16 నుంచి ప్రారంభమవుతాయి. వారణాసికి చెందిన పూజారి లక్ష్మీకాంత్ దీక్షిత్ రామ్ లల్లాకు పట్టాభిషేకం ప్రధాన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. జనవరి 14 నుంచి జనవరి 22 వరకు అయోధ్యలో అమృత్ మహా ఉత్సవ్ నిర్వహించనున్నారు. 1008 హుండీ మహాయజ్ఞం కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో వేలాది మంది భక్తులకు అన్నదానం చేయనున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని రామమందిరం యొక్క మహా సంప్రోక్షణకు చేరుకునే వేలాది మంది భక్తులకు వసతి కల్పించడానికి అయోధ్యలో అనేక వసతులు కల్పించారు.