అధికార కూటమిలో బీజేపీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన సీట్ల కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని చూస్తోంది. అంటే 25 కంటే ఎక్కువ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాలని కమలం పార్టీ భావిస్తోంది. దీని కోసం శివసేన (షిండే) యొక్క కొన్ని స్థానాలపై బీజేపీ కన్నేసింది.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ రోజు ఈడీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేస్తుందనే ఊహాగానాల నడుమ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజం ఏంటంటే.. అవినీతే జరగలేదని, బీజేపీ తనను అరెస్ట్ చేయాలని అనుకుంటోందని ఆయన అన్నారు. నా పెద్ద ఆస్తి నిజాయితీ అని, వారు దానిని దెబ్బతీయాలనుకుంటున్నారని బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. తనకు పంపిని ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని అన్నారు. బీజేపీ లక్ష్యం తనను అరెస్ట్ చేయించడమే కాదని,…
అయోధ్యలో రామమందిర ప్రాణ్ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సన్నాహాలు ప్రారంభించింది. దీంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారాన్ని స్టార్ట్ చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ముందు ఉండి నడిపిస్తున్నారు.
CM Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ‘హిందూ వ్యతిరేకి’ అంటూ అక్కడి బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. కర్ణాటక బీజేపీ యూనిట్ సీఎం సిద్ధరామయ్య గుడిలోకి వెళ్లేందుకు నిరాకరించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇతర మంత్రులు, పూజారి లోపలకి ఆహ్వానించినప్పటికీ సీఎం గుడి ప్రవేశద్వారం వద్ద నిలబడి ఉన్న వీడియోని బీజేపీ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేసింది.
పొత్తులపై ఇప్పటికే అభిప్రాయ సేకరణ పూర్తైంది.. ఏపీ ముఖ్య నేతలమంతా పొత్తులపై మా అభిప్రాయాలు అధిష్టానానికి చెప్పేశాం. ఇక, పొత్తులపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేశారు రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్
NCP: శ్రీ రాముడిని ఉద్దేశించి ఎన్సీపీ(శరద్ పవార్) నేత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. నాసిక్‌లోని షిర్డీలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన జితేంద్ర అవద్ చేసిన కామెంట్స్‌పై బీజేపీ ఫైర్ అవుతోంది. జనవరి 22న అయోధ్య రామ మందిరి ప్రతిష్టాపన కార్యక్రమానికి కొన్ని రోజుల ముందు అవద్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని ప్రేరేపించాయి.
కొందరు మంత్రుల ముఖ కవళికలు, వాళ్లు వాడుతున్న భాషను చూస్తుంటే…. అధికారంలో ఉన్న సమయంలో బీఆర్ఎస్ నేతలు వ్యవహరించిన తీరు గుర్తుకొస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. కొందరు మంత్రుల్లో అప్పుడే అహంభావం కన్పిస్తోందని, ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కిషన్ రెడ్డి బీఆర్ఎస్ బినామీ అంటూ పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించగా బండి సంజయ్ పై విధంగా స్పందించారు. ‘‘ఎవరికి ఎవరు కోవర్టో, ఏ పార్టీ నేతలు..…
ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 11 అంశాలతో ఏపీ బీజేపీ రాజకీయ తీర్మానం చేసింది. ఈ రాజకీయ తీర్మానాన్ని ఏపీ బీజేపీ ఏకగ్రీవంగా ఆమోదించింది.
రాబోయే ఎన్నికలకు ఈ సమావేశం చివరిది.. ఎన్నికలకు సమాయత్తయ్యేలా ఇవాళ, రేపు సమావేశాలు ఉంటాయని తెలిపారు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. విజయవాడలో బీజేపీ రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్చార్జీల సమావేశం ప్రారంభం అయ్యింది.. ఈ కీలక సమావేశాల్లో మాట్లాడిన ఆమె.. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ జెండా రెపరెపలాడుతుంది..
కూటమిలో ఇతర భాగస్వామ్య పార్టీలతో చర్చించి, వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయమై నిన్న నితీష్ కుమార్ శివసేన(యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రేతో మాట్లాడారు. నితీష్ కుమార్‌ని ఈ పదవికి ఎంచుకునే ఆలోచనను ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కూడా మద్దతు తెలిపినట్టు తెలుస్తోంది.