2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అతపెద్ద పార్టీగా అవతరిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మాత్రం తగిన సంఖ్యకు దూరంగా ఉంటుందని, ఎన్డీయే మిత్రపక్షాలు బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు నిరాకరించే అవకాశం ఉందని, దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని నిరోధించవచ్చని అన్నారు.
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో శ్రీ వీరభద్ర స్వామిని దర్శించుకోని ప్రత్యేక పూజలు నిర్వహించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్. చరిత్ర కలిగిన దేవాలయం శ్రీ వీరభద్ర స్వామి దేవాలయం, ఆలయ పూజారులు, అధికారులు గుట్టపై వున్న శివాలయం శిథిలావస్థలో వుందని తెలిపారు. దీంతో.. ఎంపీ నిధులు నుండి కొండపైన ఉన్న గుడి అభివృద్ధి కోసం 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తా అవసరం అయితే మరిన్ని నిధులు కేటాయిస్తానని బండి…
Congress: కాంగ్రెస్ పార్టీకి వరసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. 2019 నుంచి ఆ పార్టీ నుంచి కీలక నేతలు బయటకు వెళ్తూనే ఉన్నారు. తాజాగా మహారాష్ట్రలో కీలక నేత, కాంగ్రెస్తో 50 ఏళ్లుగా అనుబంధం ఉన్న కుటుంబంలోని సీనియర్ నేత మిలింద్ దేవరా కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ మొదలుపెట్టే రోజు ఆయన పార్టీకి రాజీనామా చేశారు.
Ponnam Prabhakar: అనాడు రాజీవ్ గాంధీ యే రాముడి చరిత్ర వెలికి తీశారని రవాణా, బీసీ సంక్షేమం మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆయన పర్యటించారు.
Narendra Modi : జనవరి 22న అయోధ్యలోని రామమందిరంలో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్రమోడీ హాజరు కానున్నారు.
సూర్యాపేట జిల్లాలో నీటిపారుదల సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పర్యటించారు. ఆత్మకూర్ (ఎస్) మండలం నెమ్మికల్లు వద్ద దండు మైసమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆయన పాటు సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ పాల్గొన్నారు. పూర్ణకుంభంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి స్వాగతం పలికారు ఆలయ అర్చకులు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్…
అయోధ్యలో శ్రీరాముడు బీజేపీకి సొంతం కాదు.. ఆస్తి అంతకన్నా కాదని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. శుక్రవారం తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బీజేపీ తీరును నిశితంగా ఆక్షేపించారు. శ్రీరాముని పేరుతో ఓట్ల రాజకీయం చేయడం శోచనీయం అని అన్నారు. శ్రీరాముడు ప్రపంచంలోని ప్రతి హిందువు ఆరాధ్యదైవమని అన్నారు. కాంగ్రెస్ హిందువు, శ్రీరామునికి వ్యతిరేకమనే ప్రచారం ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే బీజేపీ కుట్రను ఖండించారు. శ్రీరాముని కల్యాణం తరువాత అక్షింతలను…
రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్ర పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి సీనియర్ ఖండిస్తున్నట్లు తెలిపారు. మోడీ పాలనలో దేశ ప్రజలు స్వేచ్ఛగా బ్రతికే పరిస్థితి లేదని ఆరోపించారు. ప్రశ్నించిన ప్రతిపక్షాలను సైతం ఈడీ, సీబీఐ పేరుతో అణిచివేసే కుట్ర జరుగుతుందని మండిపడ్డారు. 60 ఏళ్ల స్వతంత్ర ఫలాలను దేశ ప్రజలకు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేసిందని పేర్కొన్నారు. మరోవైపు.. పార్లమెంట్ ఎన్నికలో కాంగ్రెస్…
భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ సన్నాహాక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తు గతంలో లేదు.. భవిష్యత్ లో ఉండదని అన్నారు. కేసీఆర్ 45 ఏళ్ల రాజకీయ జీవితంలో బీజేపీతో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకోలేదని తెలిపారు. ఇదిలా ఉంటే.. ఇకపై ఎమ్మెల్యే చుట్టూ పార్టీ తిరిగే విధానం ఉండదని.. ఇకపై పార్టీ చుట్టూ ఎమ్మెల్యే తిరిగే విధానం ఉంటుందన్నారు. పార్టీలో క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించబోమని తెలిపారు. బీఆర్ఎస్ కు బీజేపీ బీ…
Congress: 2024 సార్వత్రిక ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. రెండు మూడు నెలల్లో లోక్సభ ఎన్నికలకు నగారా మోగబోతోంది. ఇదిలా ఉంటే ఈ సారి బీజేపీని గద్దె దించి కాంగ్రెస్, ఇండియా కూటమి అధికారం చేపట్టాలని గట్టిగా కోరుకుంటున్నాయి. కాంగ్రెస్, టీఎంసీ, జేడీయూ, ఆర్జేడీ, ఆప్ వంటి కీలక పార్టీలు ఇండియా కూటమి పేరుతో కొత్త కూటమిని ఏర్పాటు చేశాయి. అయితే కాంగ్రెస్కి మాత్రం కష్టకాలం కనిపిస్తుంది. దేశంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్తలుగా సునీల్ కనుగోలు…