BJP: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సం జరిగే రోజే సర్వమత ర్యాలీకి పిలుపునిచ్చారు. దీనిపై బీజేపీ ఫైర్ అవుతోంది. ముఖ్యమంత్రి ‘సంప్రీతి యాత్ర’ గురించి బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్ మాట్లాడుతూ.. మమతా బెనర్జీ అయోధ్యలో రామ మందిర కార్యక్రమానికి వెళ్లడం లేదు, ఇక్కడ ఊరేగింపు చేస్తు్న్నారు, ఆమె ఎవరిని కలుపుతోంది..? బెంగాల్లో రక్తపాతం జరుగుతోందని, ఆమెను రాముడు కూడా క్షమించడని మండిపడ్డారు.
Chandigarh Mayor Polls: బీజేపీ, ప్రతిపక్ష ఇండియా కూటమి మధ్య తొలిపోరుగా భావిస్తున్న చండీగఢ్ మేయర్ ఎలక్షన్ ఈ రోజు జరగబోతోంది. మేయర్, సీనియర్ డిప్యూటీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు నేడు ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. గత 8 ఏళ్లుగా బీజేపీ చేతలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ని చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్, ఆప్ చేతులు కలిపాయి. దీంతో ఈ ఎన్నికల ప్రాధాన్యత సంతరించుకుంది. 35 మంది సభ్యులున్న చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీకి 14 మంది…
Congress: రామ మందిర వేడుకలపై మరిసారి కాంగ్రెస్, బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసింది. జనవరి 22న రామ మందిర ప్రాణప్రతిష్ట వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, అధిర్ రంజన్ చౌదరిలకు రామ మందిర ట్రస్ట్ ఆహ్వానం పంపింది. అయితే ఇది ఆర్ఎస్ఎస్/బీజేపీ కార్యక్రమని, తాము హాజరుకాబోవడం లేదని ఇప్పటికే కాంగ్రెస్ స్పష్టం చేసింది.
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్ మీనా.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది.. స్టార్ హీరోల సరసన జోడి కట్టింది.. అయితే ఇప్పుడు క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తుంది.. అయితే మీనా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. మీనా రాజకీయాల్లోకి రాబోతుందనే వార్తలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.. సాదారణంగా సినీ రంగాల్లో ఉన్నవాళ్లు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుంటారు.. కొందరు సొంతంగా…
రెండు రోజుల కేరళ పర్యటనలో భాగంగా కొచ్చిలో ‘శక్తి కేంద్ర ఇన్చార్జ్ సమ్మేళనం’లో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. అనంతరం.. కేరళలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్), యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్(యూడీఎఫ్) పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశంలో వేగవంతమైన అభివృద్ధిని నిరూపితమైన ట్రాక్ రికార్డ్, భవిష్యత్తు కోసం స్పష్టమైన విజన్ కలిగిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవంకు సంబంధించి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే నగరమంతా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కాగా.. జనవరి 22న ప్రాణప్రతిష్ఠా కార్యక్రమంలో ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు రామమందిర సముదాయంలో హాజరుకానున్నారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనబోమని ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రకటించిన సంగతి తెలిసిందే.. కాగా.. ఆ రోజున తమ తమ కార్యక్రమాల్లో బిజీబిజీగా గడపనున్నట్లు తెలిపారు.
V. Hanumantha Rao: తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్వల్పంగా మెరుగుపడినట్లు తెలుస్తోంది. నిన్నటితో పోలిస్తే ఈరోజు బీపీ కాస్త తగ్గిందని వైద్యులు చెబుతున్నారు.
Sharad Pawar: రాజీవ్ గాంధీ దేశ ప్రధానిగా ఉన్న సమయంలోనే అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కీలకమైన ‘శిలాన్యాస్’ నిర్వహించారని నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ అన్నారు. కర్ణాటకలోని నిపానిలో జరిగిన బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ రామ మందిరం పేరిట రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు.
Chandigarh mayoral polls: చండీగఢ్ మేయర్ ఎన్నిక ప్రస్తుతం ఇండియా కూటమికి అగ్ని పరీక్ష కాబోతోంది. చండీగఢ్‌లో మేయర్, సీనియర్ డిప్యూటీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు గురువారం (జనవరి 18) ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ఇండియా కూటమి, బీజేపీ పార్టీకి మధ్య ముఖాముఖి పోరుగా ఉండబోతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇండియా కూటమిలో సభ్యుడిగా ఉన్న ఆప్, బీజేపీని ఓడించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఒక విధంగా…
Rahul Gandhi: రామమందిర ప్రారంభోత్సవాన్ని ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోడీపై కీలక వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామమందిర కార్యక్రమం ‘మోడీ ఫంక్షన్’గా అభివర్ణించారు. జనవరి 22న తేదీని బీజేపీ, ఆర్ఎస్ఎస్ పూర్తిగా నరేంద్రమోడీ కార్యక్రమంగా మార్చాయని, ఇడి బీజేపీ/ఆర్ఎస్ఎస్ ఫంక్షన్ అని మండిపడ్డారు. అందుకే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రెసిడెంట్ వెళ్లనని చెప్పారని అన్నారు.