Jayasudha: లోక్ సభ ఎన్నికలకు ముందు బీజేపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే విక్రమ్ గౌడ్ రాజీనామా చేయగా.. ఇప్పుడు ప్రముఖ తెలుగు సినీ నటి, మాజీ ఎమ్మెల్యే కూడా బీజేపీకి గుడ్ బై చెప్పారు.
Mamata Banerjee: తృణమూల్ కాంగ్రెస్ సుప్రీమో, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ‘‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ని వ్యతిరేకించారు. దీనిపై ప్యానెల్ కార్యదర్శి నితేన్ చంద్రకు లేఖ రాశారు. ఏక కాలంలో దేశవ్యాప్తంగా ఎన్నికలను తాము ఒప్పుకోమని చెప్పారు. జమిలి ఎన్నికలకు ‘‘ అధ్యక్ష పరిపాలనకు ఒక అడుగు’’ అని పేర్కొంది.
BJP: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ వేడుకలక ఆహ్వానాన్ని ప్రతిపక్ష నేతలు తిరస్కరించడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎవరైతే ఆహ్వానాలు తిరస్కరించారో వారిని టార్గెట్ చేస్తూ పోస్టర్ వార్కి దిగింది. ఆ పార్టీలు హిందూ వ్యతిరేకులని బీజేపీ ఆరోపించింది. ‘‘ రామ మందిర ప్రాణ్ ప్రతిష్ఠా వేడుకకు ఆహ్వానాన్ని తిరస్కరించిన సనాతన ప్రత్యర్థుల ముఖాలను గమనించండి’’ అంటూ తన ఎక్స్(ట్విట్టర్)లో షేర్ చేసింది.
తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ తన రక్తాన్ని రంగరించారని.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ఎక్కడ రక్తం చిందించలేదంటూ సెటైర్ వేశారు. కేసీఆర్ మూర్ఖత్వ పాలన నుంచి కాపాడేందుకు బీజేపీ కార్యకర్తలు రక్తం చిందించి జైల్లో శిక్షలు అనుభవించారని తెలిపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాజీ మంత్రి కేటీఆర్ ను ఇప్పటికే జైల్లో పెట్టే వారమని ఘాటు వ్యాఖ్యలు…
Kishan Reddy: పాటిగడ్డ కాలనీలో సుమారు 15 ఏండ్ల కిందట కట్టిన ఇండ్లు పేదలకు ఇంతవరకు ఇవ్వలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బేగంపేట్, ఓల్డ్ పాటిగడ్డ బస్తిలో కిషన్ రెడ్డి పర్యటించారు.
Ram Mandir : జనవరి 22న అయోధ్యలో జరిగే రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధినేత ఎల్కే అద్వానీ హాజరవుతారని విశ్వహిందూ పరిషత్ నేత ఒకరు తెలిపారు.
BJP: బీజేపీ టార్గెట్ 400.. ప్రతిపక్ష ఎంపీలను చేర్చుకునేందుకు ప్యానెల్ ఏర్పాటు.. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. మరోసారి బీజేపీ అధికారంలోకి రావాలని వ్యూహాలు రచిస్తుంటే.. ప్రతిపక్ష ఇండియా కూటమి ప్రధాని మోడీని అధికారంలోకి దించాలని భావిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సారి బీజేపీ 543 లోక్సభ స్థానాల్లో ఏకంగా 400 ఎంపీ స్థానాలను గెలవాలని టార్గెట్గా పెట్టుకుంది. దానిని సాధించేందుకు ఇతర పార్టీల ఎంపీలను బీజేపీలోకి ఆహ్వానించేందుకు పార్టీ వ్యూహాలను రూపొందిస్తున్నట్లు సమాచారం.
వచ్చే ఎన్నికల్లో నేను కూడాపోటీ చేస్తానని ప్రకటించారు. అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడినుండే పోటీకి సిద్ధమన్న ఆయన.. నాది రాజమండ్రి.. నిర్ణయం అధిష్టానానిది అని పేర్కొన్నారు సోము వీర్రాజు
JP Nadda : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులతో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా దాదాపు రెండు గంటల పాటు జరిగిన సమావేశమయ్యారు. ఈ సందర్భంలో రామమందిరం కోసం పార్టీ నిర్ణయించిన పనులను సమీక్షించారు.
దేశంలోని మారుమూల ప్రజల్లోనూ మార్పు తీసుకురావడంతోపాటు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం కల్పించడమే లక్ష్యంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నరేంద్రమోదీ ప్రభుత్వం చేపట్టిందని మధ్య ప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. ఈ కార్యక్రమం రాజకీయాలకు వేదిక కానేకాదని, కేంద్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని ప్రజలను కోరారు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రకు వివిధ శాఖల అధికారులను సమన్వయం చేయడంతోపాటు లబ్దిదారులంతా ఇక్కడికి తీసుకొచ్చి ప్రజలను భాగస్వాములను చేసిన…