లోక్‌సభ ఎన్నికలకు ముందు అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం ద్వారా బీజేపీ జిమ్మిక్కులకు పాల్పడుతోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం ఓ జిమ్మిక్ షో అని ఆమె వ్యాఖ్యానించారు.
పూర్తి శక్తితో పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కోవాలని నిర్ణయించినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ లో చేరికలు పై దృష్టి సారించినట్లు, ఫిర్ ఎక్ బార్ మోడీ సర్కార్ నినాదం తో ప్రజల్లోకి వెళ్తామని తెలిపారు. తెలంగాణలో పోటీ బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య నే అని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబం అవశ్యకత తెలంగాణకు అవసరం లేదు.. బీఆర్ఎస్ ఇరెలవెంట్(అప్రస్తుతం) పార్టీ అని ఆయన అభివర్ణించారు. తెలంగాణలో…
Rahul Gandhi: బిల్కిస్ బానో కేసులో ఈ రోజు సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. గతంలో గుజరాత్ ప్రభుత్వం క్షమాభిక్ష ద్వారా విడుదల చేసిన 11 నిందితులను ఉత్తర్వులను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీనిపై కాంగ్రెస్‌తో సహా ఇతర ప్రతిపక్షాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇది న్యాయం సాధించిన విజయమని, బీజేపీ మహిళా వ్యతిరేకి అని, నేరస్తులను ప్రోత్సహిస్తోందని ఆరోపించాయి.
లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణ బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. మెజారిటీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా 17 లోక్‌సభ స్థానాలకు ఇన్ఛార్జులను నియమించింది. రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డి సోమవారం నియమించారు. లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లుగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్, ఎమ్మెల్సీ ఎ.వెంకట్ నారాయణరెడ్డి, మాజీ ఎంపీ గరికపాటి మోహన్‌రావు, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు.…
రామ మందిర ఘనత భారతీయ జనతా పార్టీదేనని కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి ఎద్దేవా చేశారు. బీజేపీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. 'రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు రామమందిరం తాళం తెరిచేందుకు చర్యలు తీసుకున్నారు అనే విషయాన్ని గుర్తు చేశారు.
BJP: పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ దృష్టి సారించింది. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం తర్వాత ప్రధాని మోదీ తెలంగాణకు రానున్నారు. తెలంగాణలో ఎన్నికల సభలు జరగనున్నాయి.
MLA Raja Singh: తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మహారాష్ట్రలో పోలీసు కేసు నమోదైంది. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగం చేశారంటూ గోషామహల్ ఎమ్మెల్యేపై షోలాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
విశాఖలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బీసీ సామాజిక చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఓబీసీ విభాగం జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, దగ్గుబాటి పురంధేశ్వరి, సీఎం రమేష్, సత్యకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర జనాభాలో 70శాతం బీసీలు ఉన్నారని తెలిపారు. ఇక్కడ చైతన్యం కొరవడిందని గుర్తించి బీసీలను కదిలించి న్యాయం చేసేందుకు బీజేపీ ముందుకు వచ్చిందని అన్నారు. ఏపీలో బీసీలు అణచివేతకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.…
విశాఖలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బీసీ సామాజిక చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఓబీసీ విభాగం జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, దగ్గుబాటి పురంధేశ్వరి, సీఎం రమేష్, సత్యకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీసీలకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపించారు. అంతేకాకుండా.. బీసీ కమిషన్ కు ఎందుకు చట్టబద్ధత కల్పించలేకపోయిందని బీజేపీ ప్రశ్నిస్తోందని తెలిపారు. నా బీసీ కులాలు అనే నైతికత జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ ఉందని ప్రశ్నిస్తున్నామన్నారు.…
Lok Sabha elections: లోక్‌సభ ఎన్నికలకు మరికొన్ని కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. దీంతో బీజేపీ ఎన్నికల మోడ్‌లోకి వెళ్తోంది. లోక్‌సభ ఎన్నికలకు ప్రధాని నరేంద్రమోడీ శ్రీకారం చుట్టబోతున్నారు. జనవరి 13 నుంచి బీహార్‌లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. బీహార్ లోని బెట్టియా నగరంలోని రామన్ మైదాన్‌లో ఆయన బహిరంగ సభకు హాజరుకాబోతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ పర్యటనలోనే ప్రధాని బీహార్ లోని రోడ్లు, వంతెనలతో సహా వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు.