Himachal Pradesh : ఫిబ్రవరి 27న జరిగిన రాజ్యసభ ఎన్నికల సందర్భంగా జరిగిన క్రాస్ ఓటింగ్ తర్వాత హిమాచల్ ప్రదేశ్‌లో తలెత్తిన రాజకీయ తుఫాను ఇప్పట్లో ఆగి పోయే సూచనలు కనిపించడం లేదు.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే ఆయా రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. అయితే ప్రధాన పార్టీలు ప్రత్యర్థులను ఢీకొట్టేందుకు సినీ ప్రముఖులను కూడా రంగంలోకి దించాయి.
సార్వత్రిక ఎన్నికల వేళ ఒడిశాలో అధికార బీజేడీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కటక్ ఎంపీ భర్తృహరి మహతాబ్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు పంపించారు.
బీఅర్ఎస్ విద్యుత్ కొనుగోళ్లలో భారీ అవినీతికి పాల్పడిందన్నారు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. ఇవాళ ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయం మాట్లాడుతూ.. ఎన్టీపీసీలో చవకగా వచ్చే విద్యుత్తును కాదని కమీషన్ కోసమే ఇతర సంస్థల నుంచి బీఅర్ఎస్ విద్యుత్ కొనుగోలు చేసిందన్నారు. గతంలో బీఅర్ఎస్ విద్యుత్ అవినీతిపై రేవంత్ ఆరోపణలు చేశాడన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారం చేపట్టాక రేవంత్ ఎందుకు స్పందించడం లేదని, ఎన్టీపీసీ తో ppl కుదుర్చుకోవడానికి కాంగ్రెస్ ముందుకి ఎందుకు రావడం లేదు? అని ఆయన…
ఒడిశాలో బీజేడీతో బీజేపీ పొత్తుపై క్లారిటీ వచ్చేసింది. గత కొద్ది రోజులుగా బీజేడీతో బీజేపీ పొత్తు పెట్టుకోబోతుందని వార్తలు వినిపించాయి. ఇటీవల ఒడిశాలో ప్రధాని మోడీ పర్యటనతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది.
Delhi liquor policy scam: మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కస్టడీని కోరుతూ ఈ రోజు రోస్ ఎవెన్యూ కోర్టులో వాడీవేడి వాదనలు కొనసాగుతున్నాయి. ఈడీ కేజ్రీవాల్‌ని కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరుతోంది. ఈడీ తరుపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కేజ్రీవాల్‌కి 10 కస్టడీని కోరారు. ఈడీ కోర్టుకు సమర్పించిన పత్రాల్లో మొత్తం ఢిల్లీ మద్యం కుంభకోణంలో ‘‘కింగ్‌పిన్’’ అరవింద్ కేజ్రీవాల్ అని తెలిపింది. ఇతను ‘‘సౌత్ లాబీ’’కి అనుకూలంగా…
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను గురువారం రాత్ర ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్ అరెస్ట్ ను ఖండించారు. ప్రభుత్వ పాఠశాలలను బాగు చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడం రాజకీయ కక్షలో భాగమేనని ఆరోపించారు. గుజరాత్ లో నేరాలు చేసిన వారిని మాత్రం నిర్దోషులుగా క్షమాభిక్ష పెడుతున్నారని.. ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా జరగడం శోచనీయం అని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాల్ని నిరసిస్తూ రైతులు నల్లజెండాలు ఎగురవేయాలని సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా పిలుపునిచ్చారు.
Kunamneni Sambashiva Rao: కాంగ్రెస్ ని ఎంపీ సీట్లు అడుగుతున్నామని, పోటీ చేయాలని అడుగుతున్న సీట్ల వివరాలు కాంగ్రెస్ కి ఇచ్చామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు అన్నారు.