Kangana Ranaut: కాంగ్రెస్ మహిళా నేత అభ్యంతరకర పోస్ట్! బీజేపీ మండిపాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై కాంగ్రెస్ మహిళా నేత సుప్రియ చేసిన పోస్టు తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వ్యవహారం కాంగ్రెస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా కంగనా రనౌత్ పోటీ చేస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించిన ఓ అభ్యంతరకర పోస్ట్ నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ మహిళానేత సుప్రియ ఇన్‌స్టాగ్రామ్ అధికారిక ఖాతాలో ప్రత్యక్షం కావడంతో కమలనాథులు భగ్గుమన్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమెను పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మరోవైపు కంగన స్పందిస్తూ.. ప్రతీ మహిళ తన గౌరవానికి అర్హురాలని పేర్కొన్నారు.
క్వీన్‌లో అమాయక పాత్ర నుంచి తలైవిలో శక్తిమంతమైన మహిళా నేత వరకు.. మణికర్ణికలో దేవత పాత్ర నుంచి చంద్రముఖిలో దెయ్యం పాత్ర వరకు.. 20 ఏళ్ల తన సినీ కెరీర్‌లో ఇలా అనేక రకాల పాత్రల్లో నటించానని కంగనా గుర్తుచేశారు. మహిళలను దురాభిమానపు సంకెళ్ల నుంచి కాపాడుకోవాలని.. సెక్స్ వర్కర్ల దుర్భర జీవితాలను ప్రస్తావిస్తూ ఇతరులను దూషించడం మానుకోవాలని.. ప్రతి మహిళ తన గౌరవానికి అర్హురాలు అని కంగనా రనౌత్ పేర్కొన్నారు.
Also Read
- layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
- Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
- Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
అయితే.. కంగనాపై పోస్టు చేసింది తాను కాదని సుప్రియా తెలిపారు. ఎక్కడో పొరపాటు జరిగింది అని ఆమె చెప్పుకొచ్చారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల యాక్సెస్ చాలామంది దగ్గర ఉందని. వారిలో ఒకరు ఈ అభ్యంతరకర పోస్ట్ పెట్టి ఉంటారని సుప్రియ చెప్పుకొచ్చారు. తన దృష్టికి రాగానే వెంటనే దాన్ని తొలగించినట్లు ఆమె చెప్పుకొచ్చారు. అయినా ఒక మహిళ గురించి ఎప్పుడూ వ్యక్తిగత వ్యాఖ్యలు చేయనని తెలిపారు. ఆ విషయం తనతో పరిచయం ఉన్న వారందరికీ తెలుసు అని వివరించారు. ఈ మేరకు ఎక్స్‌లో సుప్రియ క్లారిటీ ఇచ్చారు. మరీ ఈ దుమారం ఇంతటితో సద్దుమణిగి పోతుందా? లేదంటే ఎన్నికల వేళ మరింత రాజుకుంటుందా? వేచి చూడాలి.
मेरे फेसबुक और इंस्टा के अकाउंट पर कई लोगों का एक्सेस है. इसमें से किसी व्यक्ति ने आज एक बेहद घृणित और आपत्तिजनक पोस्ट किया था.
मुझे जैसे ही इसकी जानकारी हुई मैंने वह पोस्ट हटा दिया. जो भी मुझे जानते हैं, वह यह अच्छी तरह से जानते हैं कि मैं किसी भी महिला के लिए व्यक्तिगत भोंडी… pic.twitter.com/CFDNXuxmo2
— Supriya Shrinate (@SupriyaShrinate) March 25, 2024
తాజావార్తలు
-
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
-
Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
-
Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!