AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ సారి తెలుగుదేశం-జనసేన పార్టీలతో జట్టు కట్టి పోటీ చేస్తోంది భారతీయ జనతా పార్టీ (బీజేపీ).. అయితే.. ఇప్పటికే తాము పోటీ చేస్తున్న ఆరు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ.. ఇక, 10 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది.. మరోవైపు.. ఎన్నికల ప్రచారంపై ఫోకస్ పెడుతోంది బీజేపీ.. ఈ రోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశం అయ్యారు ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి.. ఎన్నికల ప్రచారంపై ముఖ్య నేతలతో చర్చిస్తున్నారు.. నిన్ననే ఆరు పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ. నేడో, రేపో మిగతా 10 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనుంది..
Read Also: Karthika Deepam 2: కార్తీకదీపం2 లో మోనిత పాత్రలో నటిస్తున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఇక, వచ్చే నెల (ఏప్రిల్) 5వ తేదీ నుంచి బీజేపీ ఎన్నికల ప్రచారం ప్రారంభం కానుంది. రాజమండ్రి నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి.. ఏపీలో ప్రచారంలో భాగంగా బీజేపీ నిర్వహించనున్న సభలకు కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు హాజరుఅయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.. కేంద్రమంత్రులు, జాతీయ నేతలు ఇచ్చే సమయానికి అనుగుణంగా.. వారు ఎక్కడ పాల్గొంటే బాగుంటుంది అనేదానిపై సమాలోచనలు చేస్తోంది ఏపీ బీజేపీ.. మరోవైపు.. టీడీపీ-జనసేనతో కలిసి ఉమ్మడిగా నిర్వహించే సభలపైనే చర్చించినట్టుగా తెలుస్తోంది.. ఈ సభలకు బీజేపీ కీలక నేతలను రంగంలోకి దించే అవకాశం ఉంది.