ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి తరపున ఇంకా 20 అసెంబ్లీ, 10 పార్లమెంట్ స్థానాలు క్లారిటీ రాలేదు.. తాము ప్రకటించిన అనపర్తి, పి.గన్నవరం స్థానాలను బీజేపీ, జనసేనలకు టీడీపీ వదిలి పెట్టింది. దీంతో టీడీపీలో పెండింగ్ స్థానాలు ఏడుకు పెరిగాయి.
Lok Sabha Elections 2024: 2024 లోక్‌సభ ఎన్నికలకు బిజెపి అభ్యర్థుల ఐదవ జాబితా ఈరోజు వచ్చే అవకాశం ఉంది. ఐదు రాష్ట్రాల (ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్) అభ్యర్థుల పేర్లను విడుదల చేసే జాబితా మధ్యాహ్నం వచ్చే వీలుంది.
TS BJP: లోక్ సభ షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలో 'టార్గెట్ కాంగ్రెస్' వ్యూహంతో బీజేపీ ముందుకు సాగుతోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కువ స్థానాలు గెలుచుకున్న అధికార బీఆర్ఎస్పై కాకుండా కాంగ్రెస్‌పైనే ప్రధానంగా దృష్టి సారించింది.
మొత్తానికి కర్ణాటకలో బీజేపీ-జేడీఎస్ మధ్య పొత్తు కుదిరింది. అలాగే సీట్ల పంకాలు కూడా ఖరారయ్యాయి. మొత్తం కర్ణాటకలో 28 లోక్‌సభ స్థానాలకు గాను బీజేపీ 25 సీట్లలో, జేడీఎస్ 3 సీట్లలో పోటీ చేయనున్నాయి.
ఢిల్లీలో మరికాసేపట్లో బీజేపీ సమావేశం కానుంది. బీజేపీ ప్రధాన కార్యాలయంలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో.. ఏపీలో బీజేపీ పోటీ చేసే స్థానాలు, అభ్యర్దులు. ఖరారు కానున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే.. ఏపీలో స్థానాలు, అభ్యర్ధుల ఖరారు పై సుదీర్ఘంగా బీజేపీ నేతల మధ్య చర్చోపచర్చలు సాగాయి.
గజ్వేల్‌లో పట్టుబడ్డ నగదు.. రూ.50 లక్షలు సీజ్..! గజ్వేల్ పట్టణంలో పెద్ద మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న డబ్బు పట్టుబడింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో గజ్వేల్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బచ్చు రత్నాకర్‌కు చెందిన కారు (టీఎస్36సీ 0198)లో రూ.50 లక్షల నగదును పోలీసులు గుర్తించారు. నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు స్వాధీనం చేసుకోలేదు. ఈ సందర్భంగా గజ్వేల్ సీపీ అనురాధ మాట్లాడుతూ రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లరాదని సూచించారు.…
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ క్రమంలో.. ఏలూరు ఎంపీ అభ్యర్థి ప్రకటనతో బీజేపీ, టీడీపీలో ముసలం ఏర్పడింది. టీడీపీ నేత పుట్టా మహేష్ యాదవ్ కు టికెట్ కేటాయించడంపై పార్టీ నేతల్లో అసంతృప్తి నెలకొంది. ఈ క్రమంలో.. టీడీపీని వీడేందుకు గోపాల్ యాదవ్ సిద్ధమయ్యారు. ఆయన ఎంపీ టికెట్ ఆశించగా నిరాశ ఎదురైంది.
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. ఆ పార్టీకి చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఈ రోజు బీజేపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఈ రోజు బీజేపీలో చేరనున్నారు. ఇటీవల రాజ్యసభ ఎంపీల ఎన్నిక సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ తరుపున క్రాస్ ఓటింగ్‌కి పాల్పడ్డారు. దీంతో వారిపై అనర్హత వేటు వేశారు.