మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు..! మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో వనదేవతల దర్షనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో సమక్క సారాలమ్మ ఆలయం ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. మహాజాతర ముగిసిపోయి నెల గడిచినా భక్తుల రద్దీ మాత్రం తగ్గడం లేదు. ఇవాళ గొర్రెల బలి, బంగార(బెల్లం) లతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో మునుగు జిల్లాలో రోడ్లన్నీ భక్తులతో కిటకిటలాడాయి. అమ్మవార్ల దర్శనానికి భక్తులు…
సోషల్ మీడియా ప్రాముఖ్యత .. ప్రజలను ప్రభావితం చేయగల సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మే 13 లోక్సభ ఎన్నికల కోసం పార్టీని మరింత విస్తృతం చేయడానికి సోషల్ మీడియా ద్వారా ప్రజలను పెద్ద ఎత్తున కనెక్ట్ చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది. ఇంటర్నెట్లో మహిళలు, యువత మరియు నవయుగ ఓటర్ల సంఖ్య విపరీతంగా పెరగడంతో, రాష్ట్రంలోని బిజెపి సోషల్ మీడియా వార్ రూమ్ రాష్ట్రంలోని ఓటర్లను చేరుకోవడానికి వివిధ సోషల్ మీడియా…
Bengal BJP: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) కన్నా ఒక్క సీటు ఎక్కువ వచ్చినా 2026 లోపే మమతా బెనర్జీ సర్కార్ పడిపోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) బెంగాల్ బీజేపీకి సైద్ధాంతిక అంశమని అన్నారు. రాష్ట్రంలో ఎంపీ స్థానాలను స్వీప్ చేయడానికి ఈ చట్టం సహాయపడుతుందని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో అవినీతి, అరాచక టీఎంసీని ఓడించాలని రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకున్నారని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మజుందార్ అన్నారు.
బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం ఇవాళ జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు స్వచ్ఛందంగా బీజేపీ కార్యక్రమాలు వస్తున్నారు…మోడీ ప్రధాని కావాలని అంటున్నారు…కేంద్ర పథకాల తో ప్రజల్లోకి వెళ్ళాలన్నారు. తెలంగాణలో బీజేపీ సానుకూల వాతావరణం ఉంది… అద్భుతమైన పలితాలు సాధిస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసిన, డబ్బులు ఖర్చు పెట్టిన డబుల్ డిజిట్ సీట్లు బీజేపీ కే వస్తాయని ఆయన ధీమా వ్యక్తం…
RKS Bhadauria: లోక్ సభ ఎన్నికల ముందు బీజేపీలోకి వలసలు పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు ప్రతిపక్ష పార్టీల నుంచి బీజేపీకిలో చేరుతున్నారు. తాజాగా భారత వాయుసేన మాజీ చీఫ్ ఆర్కేఎస్ భదౌరియా ఆదివారం బీజేపీలోకి చేరారు. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, బీజేపీ ప్రధాని కార్యదర్శి వినోద్ తావ్దే సమక్షంలో పార్టీలో చేశారు.
Jagadish Reddy: ఎమ్మెల్సీ కవిత కేస్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటున్నారు.. ఈడీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని కూడా విచారణ చేయాలని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సంచలన వ్యాక్యలు చేశారు.
మోడీ మాయలో ఎవరూ పడవద్దు.. ఉత్తర భారత జనతాపార్టీనీ తుక్కు తుక్కు గా ఓడించాలి అని పిలుపునిచ్చారు. పోలవరాన్ని ప్రక్కన పెట్టి ఉత్తరాంధ్రలో ఎలా పోటీ చేస్తారు.. కృష్ణ పట్నం పోర్టును తొక్కిపెట్టారు అని పేర్కొన్నారు. రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీని ఓడించాలని పిలుపునిస్తున్నాం.. రాష్ట్రం గురించి ఒక్క మాట కూడా ప్రధాని మోడీ మాట్లాడలేదు అని చలసాని శ్రీనివాస్ తెలిపారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి తరపున ఇంకా 20 అసెంబ్లీ, 10 పార్లమెంట్ స్థానాలు క్లారిటీ రాలేదు.. తాము ప్రకటించిన అనపర్తి, పి.గన్నవరం స్థానాలను బీజేపీ, జనసేనలకు టీడీపీ వదిలి పెట్టింది. దీంతో టీడీపీలో పెండింగ్ స్థానాలు ఏడుకు పెరిగాయి.