Shobha Karandlaje: బీజేపీ నాయకురాలు, కేంద్ర మంత్రి శోభా కరంద్లాజేపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది. మార్చి 1న బెంగళూర్లో జరిగిన రామేశ్వరం కేఫ్ పేలుడును ఉద్దేశిస్తూ.. తమిళనాడు నుంచి వచ్చిన వ్యక్తి బాంబు పెట్టాడని వ్యాఖ్యలు చేశారు. తమిళులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ తమిళనాడు అధికార పార్టీ డీఎంకే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీంతో ఆమెపై చర్యలు తీసుకోవాలని బుధవారం పోల్ ప్యానెల్ ఆదేశించింది.
సొంత పార్టీపైనే విమర్శలు గుప్పించడంతో వరుణ్ గాంధీ పొలిటికల్ కెరీర్ ఇరాటకంలో పడింది. ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నారు.
ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది.. ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని రాష్ట్ర రోడ్డు రవాణా భవనాలు, సినీమాటోగ్రాఫి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఇవాళ నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో ఆయన పర్యటించారు. గూడూరు, వెంకటాద్రిపాలెం గ్రామాలలో నూతనంగా నిర్మించిన ఆలయాలలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షాలతో జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు నష్టపరిహారం అందిస్తామన్నారు. ధాన్యానికి రైస్ మిల్లర్స్ మద్దతు ధర చెల్లించకుంటే మిల్లులను సీజ్…
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ రాస్ట్రంలోని బదౌన్ సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు బాలురను స్థానికంగా ఉండే బార్బర్ సాజిత్ గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటన తర్వాత యూపీ పోలీసులు నిందితుడిని ఎన్కౌంటర్లో చంపేశారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపింది. మంగళవారం జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో దిగజారుతున్న శాంతిభద్రతల పరిస్థితులను చూపిస్తున్నాయంటూ ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ), అధికార బీజేపీ సర్కార్పై విమర్శలు గుప్పించింది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో…
CM Siddaramaiah: కర్ణాటక సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ప్రధాని నరేంద్రమోడీ టార్గెట్గా విమర్శలు చేశారు. బీజేపీలో తిరుగబాటు నాయకులను అదుపు చేయలేని బలహీన ప్రధానిగా ఆరోపించారు. శివమొగ్గలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు సిద్ధరామయ్య ప్రతిస్పందించారు. ‘‘ దోపిడిలో భాగస్వామ్యం కావడానికి కర్ణాటకలో పోటీ నెలకొంది. సీఎం-ఇన్-వెయిటింగ్, కాబోయే సీఎం ఆశావహులు, సూపర్ సీఎం, షాడో సీఎం ఇలా కాంగ్రెస్లో ఉన్నారు. చాలా మంది సీఎంల నడుమ ఢిల్లీలో కలెక్షన్ మినిస్టర్…