అసోంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. లఖింపూర్ జిల్లాలోని నవోబోయిచా ఎమ్మెల్యే భరత్ చంద్ర నారా, తన భార్యకు లోక్‌సభ సీటు ఇవ్వలేదని ఇవాళ (సోమవారం) హస్తం పార్టీకి రాజీనామా చేశారు. లఖింపూర్ లోక్‌సభ స్థానానికి ఉదయ్ శంకర్ హజారికాను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే, మాజీ కేంద్ర మంత్రి అయిన తన భార్య రాణీ నారాకు ఈ సీటు ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన నారా.. టికెట్ రాకపోవడంతో నేడు పార్టీకి రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు.
Read Also: SOT Attacks: సైబరాబాద్ లోని బల్ట్ షాప్ లపై ఎస్ఓటీ దాడులు..!
ఈ సందర్భంగా.. కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నాను అని ఎమ్మెల్యే భారత్ చంద్ర నారా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు రాజీనామాను పంపించారు. అస్సాం కాంగ్రెస్ మీడియా సెల్ చైర్మన్ పదవికి కూడా అతడు రాజీనామా చేశారు. అయితే, ఢకుఖానా నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా భరత్ చంద్ర నారా ఉన్నారు. అలాగే, 2021లో నవోబోయిచా నుంచి ఆరవసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌లో చేరడానికి ముందు అతను అసోమ్ గణ పరిషత్ (AGP)లో ఉన్నారు.
Read Also: Tollywood Shooting Updates: రామోజీ ఫిల్మ్ సిటీలో బన్నీ, బాలయ్య, శర్వా.. ప్రభాస్ మాత్రం?
ఇక, భారత్ చంద్ర నారా AGP, కాంగ్రెస్ ప్రభుత్వాలలో క్యాబినెట్ మంత్రిగా కూడా పని చేశారు. ఆయన గత ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్‌కి పత్రికా సలహాదారుగా కూడా ఉన్నారు. అలాగే, అతని భార్య రాణీ నారా మూడుసార్లు లఖింపూర్ నుంచి ఎంపీగా ఉన్నారు.. ఒకసారి రాజ్యసభకు కూడా పని చేశారు. కొన్ని నెలల క్రితం అధికార బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన రాణీ నారా, హజారికా లఖింపూర్ నుంచి టికెట్ కోసం పోటీలో ఉన్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Read Also: Sanjay Raut: కేజ్రీవాల్ అంటే ప్రధాని మోడీకి భయం..
అయితే, హజారికా పార్టీలో కొత్త వ్యక్తి అయినప్పటికీ, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ భూపేన్ కుమార్ బోరా నుంచి అతనికి బలమైన మద్దతు ఉందని భరత్ చంద్ర నారా ఆరోపించారు. అలాగే, లిఖింపూర్ నియోజక వర్గంలో వరుసగా మూడోసారి పోటీ చేయాలనుకుంటున్న బీజేపీ అభ్యర్థి ప్రదాన్ బారుహ్‌తో హజారికా పోటీ పడబోతున్నారు. అలాగే, అస్సాంలో 14 లోక్‌సభ స్థానాలకు గాను 13 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను బరిలోకి దింపింది.