Kunamneni Sambashiva Rao: కాంగ్రెస్ ని ఎంపీ సీట్లు అడుగుతున్నామని, పోటీ చేయాలని అడుగుతున్న సీట్ల వివరాలు కాంగ్రెస్ కి ఇచ్చామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు అన్నారు.
ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో తన కొడుకే ఇండిపెండెంట్ అభ్యర్ధిగా బరిలోకి దిగి విజయం సాధిస్తారని కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప తెలిపారు.
Congress: అరవింద్ కేజ్రీవాల్‌ని ఢిల్లీ మద్యం కేసులో ఈడీ ఈ రోజు అరెస్ట్ చేసింది. అరెస్ట్ నుంచి రక్షణ ఇవ్వలేమని ఢిల్లీ హైకోర్టు పేర్కొన్న కొన్ని గంటల తర్వాత ఈడీ అధికారులు కేజ్రీవాల్ నివాసం సోదాలు నిర్వహించి, అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్‌పై ప్రతిపక్ష పార్టీలు కేంద్రంలోని బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి. కాంగ్రెస్‌తో పాటు ఇండియా కూటమిలోని పలు పార్టీలు బీజేపీపై తీవ్రస్థాయిలో దాడి చేస్తున్నారు.
జగన్‌తో పిఠాపురం ఎమ్మెల్యే దొర బాబు భేటీ.. ఆ విషయంలో అంగీకారం వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్‌తో పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు భేటీ అయ్యారు. పిఠాపురంలో వంగ గీత గెలుపు కోసం కృషి చేయాలని దొరబాబును ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. అంగీకరించిన దొరబాబు…పార్టీ ఆదేశాల ప్రకారం నడుచుకుంటానని జగన్‌కు చెప్పారని తెలిసింది. అధికారంలోకి వచ్చిన తరవాత ఎమ్మెల్సీ పదవి ఇస్తామని దొరబాబుకు వైయస్ జగన్ హామీ ఇచ్చినట్లు సమాచారం. పిఠాపురం నుంచి జనసేన…
Annamalai: బీజేపీ దక్షిణాది రాష్ట్రాలని టార్గెట్ చేసింది. ముఖ్యంగా తమిళనాడులో ఎన్నడూ లేనంతగా బీజేపీకి ఆశలు చిగురిస్తున్నాయి. దీనికి కారణం మాజీ ఐపీఎస్ అధికారి, తమిళ సింగంగా పేరు తెచ్చుకున్న కె. అన్నామలై. 37 ఏళ్ల ఈ యంగ్ పొలిటిషియన్‌ని బీజేపీ తమ భవిష్యత్తుగా భావిస్తోంది. అందుకనే అతి తక్కువ వయసులో తమిళనాడు వంటి రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. బీజేపీ పార్టీ అన్నామలైని చాలా స్పెషల్‌గా భావిస్తోంది.
Electoral bonds: సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని ఈ రోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) వివరాలను కేంద్రం ఎన్నికల సంఘానికి అందించింది. బాండ్లకు సంబంధించి అన్ని ముఖ్యమైన ప్రత్యేక నంబర్లను కూడా అందించింది. ఇది నిధులు ఇచ్చిన దాతలు, తీసుకున్న పార్టీల వివరాలను సరిపోల్చడానికి సహాయపడుతుంది. బ్యాంక్ ఇచ్చిన వివరాలను ఎన్నికల సంఘం త్వరలో తన వెబ్సైట్లో పొందుపరుచనుంది. అకౌంట్ నంబర్, కేవైసీ డిటెయిల్స్ వెల్లడి కానున్నాయి.
ఏపీల బెజవాడ పశ్చిమ సీటు పంచాయితీ రసవత్తరంగా మారింది. ఎట్టకేలకు బెజవాడ పశ్చిమ సీటు పంచాయితీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ దగ్గరకు చేరింది. పశ్చిమ సీటు జనసేనకు ఇవ్వాలని పోతిన మహేష్ వర్గం వారం రోజులుగా వరుస ఆందోళనలు చేపడుతోంది.
Sadananda Gowda: లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సిట్టింగ్ ఎంపీ డీవీ సదానంద గౌడ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. బెంగళూర్ నార్త్ సీటు నుంచి వేరే అభ్యర్థిని ప్రకటించడంతో ఆయన కలత చెందానని, దీంతో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు సదానంద గౌడ గురువారం ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఈ స్థానం నుంచి కేంద్ర సహాయ మంత్రి శోభా కరంద్లాజేని బీజేపీ బరిలోకి దింపింది. ప్రస్తుతం…
Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమయ్యాయి. తమ అభ్యర్థులను వరసగా ప్రకటిస్తున్నాయి. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నట్లు కేంద్రం ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇదిలా ఉంటే ఏడు దశాబ్ధాల భారత ఎన్నికల చరిత్రలో జాతీయ పార్టీల సంఖ్య తొలిసారిగా 14 నుంచి 6కి పడిపోయింది. 1951లో జరిగిన మొదటి లోక్‌సభ ఎన్నికల్లో 53 రాజకీయ పార్టీలు పోటీ చేయగా.. ప్రస్తుతం దేశంలో…