టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులో భాగంగా కమలం పార్టీకి 10 అసెంబ్లీ స్థానాలు దక్కాయి. దీంతో అభ్యర్థుల ఎంపికపై బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అధ్యక్షతన మంగళవారం ఉదయం రాష్ట్ర పదాధికారుల సమావేశం జరగనుంది.
బెజవాడ పశ్చిమ సీటుపై ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ సీటు కూటమి మొన్నటి వరకు బీసీ వ్యక్తికి ఇచ్చామని చెప్పింది.. పేద బీసీ వ్యక్తిని కాదని బీజేపీ నుంచి ధనికుడికి ఇపుడు టికెట్ ఇస్తున్నారని టీడీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను టీడీపీలో ఉన్నపుడు కూడా పశ్చిమలో తన కుమార్తె శ్వేత పోటీ చేయదు అని ప్రకటించానన్నారు. పశ్చిమ సీటు మైనార్టీ లేదా బీసీలదని టీడీపీలో ఉన్నపుడు కూడా చెప్పానని తెలిపారు.
అసోంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. లఖింపూర్ జిల్లాలోని నవోబోయిచా ఎమ్మెల్యే భరత్ చంద్ర నారా, తన భార్యకు లోక్సభ సీటు ఇవ్వలేదని ఇవాళ (సోమవారం) హస్తం పార్టీకి రాజీనామా చేశారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి భయం.. అందుకే ఆయనను అరెస్ట్ చేయించారని శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు.
పశ్చిమ బెంగాల్లోని బసిర్హత్ లోక్సభ స్థానం నుంచి రేఖ పాత్రకు బీజేపీ టికెట్ ఇచ్చింది. చాలా రోజులుగా చర్చలో ఉన్న సందేశఖలీ ఈ నియోజకవర్గంకిందకే వస్తుంది.
లోక్సభ ఎన్నికలకు ముందు కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సొంత గూటికి వెళ్తున్నారు. ఇవాళ ( సోమవారం ) మల్లేశ్వరంలోని బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర నేతల సమక్షంలో ఆయన పార్టీలోకి చేరబోతున్నారు.