తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం పడిపోతుందని కలలో కూడా ఊహించలేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం లేకపోతే రాష్ట్రం ఎట్లుంటదో జనాలకు అర్థం అయ్యింది.. ఈ ప్రభుత్వంపై గ్రామాల్లో మన్నువోసుడు, దుమ్మువోసుడే కనిపిస్తుంది. అయితే, మల్కాజ్ గిరిలో రాగిడి లక్ష్మారెడ్డి ఒక్కడే లోకల్.. ఇద్దరు నాన్ లోకలే అని ఆయన చెప్పుకొచ్చారు. లక్ష్మారెడ్డిని అభ్యర్థిగా మన అధ్యక్షుడు ప్రకటించాడు.. మనం గెలిపించాలి.. ప్రతి ఒక్కరు అభ్యర్థినే అనుకుని పని చేయాలి అని తలసాని పిలుపునిచ్చారు. మనం ఏం చేసినం.. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసిందో జనాలకు చెప్పాలి.. అసెంబ్లీ, కార్పొరేషన్ ఎన్నికల్లో లాగా పాదయాత్ర చేద్దాం అని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
Read Also: Satyakumar: మేం మోడీ కోసం పని చేస్తున్నాం.. నిన్న అందుకే సమావేశానికి రాలేదు..!
అయితే, ఈ వంద రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక చీపురు పుల్లైనా మన దగ్గరికి వచ్చిందా? అని తలసాని శ్రీనివాస్ యాదవ్ అడిగారు. ఇప్పుడు, తాగే నీళ్లు కూడా వస్తలేవు..మన ప్రభుత్వం ఏం చేసింది.. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు చెబుదాం.. అండర్ పాసులు, భైపాస్ రోడ్డులతో హైదరాబాద్ రూపు రేఖలను కేటీఆర్ మార్చేశాడు అని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల్లో ధైర్యంగా పోరాటం చేయాలి.. మనం చెప్పుకోవడానికి వందున్నాయి.. వాళ్లకి కేవలం మనల్ని తిట్టడమే పని.. మల్కాజ్ గిరిలో మనకున్న కార్యకర్తల బలం ఇంకొక్కరికి లేదు.. కంటోన్మెంట్ బై ఎలక్షన్స్ లో కూడా మన అభ్యర్థిని గెలిపించాలి.. జనాల దగ్గరికి వెళ్లేలా ఎమ్మెల్యేలు కార్యక్రమాలు చేపట్టాలి అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు.