ఢిల్లీ ప్రజలను నీటి కష్టాల పాలు చేస్తారా? ఢిల్లీని నాశనం చేస్తారా? అంటూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ ప్రశ్నించారు. తాగునీటి సమస్యలపై సంబంధిత మంత్రికి సీఎం కేజ్రీవాల్ లేఖ రాస్తే దానిపై కేసులు వేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ (బుధావారం) సునీతా కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితం సీఎం అరవింద్ కేజ్రీవాల్ తాగునీటి సమస్యలపై సంబంధించి మంత్రి అతిశీకి ఆదేశాలతో కూడిన లేఖను పంపించారు.. కానీ, వాటి మీద మోడీ సర్కార్ కేసు నమోదు చేసింది అని ఆరోపించారు. ఇంతకీ ఢిల్లీని నాశనం చేస్తారా? ఢిల్లీ ప్రజలను ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు? అంటూ సునీతా కేజ్రీవాల్ ప్రశ్నించారు.
Read Also: Double Engine OTT: ఓటీటీలోకి వచ్చిసిన డబల్ ఇంజిన్ సినిమా.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..!
ఇక, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా బాధపడుతున్నారు అంటూ సునీత కేజ్రీవాల్ తెలిపారు. ఇప్పటి వరకు ఈడీ 250 సోదాలు చేసింది.. లిక్కర్ స్కామ్ డబ్బు కోసం తనిఖీలు చేశారు.. కానీ వారికి తమ దగ్గర ఎలాంటి డబ్బు దొరకలేదు.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ రేపు (గురువారం) అన్ని విషయాలను కోర్టులో బయట పెట్టనున్నారు. లిక్కర్ స్కామ్ డబ్బు ఎక్కడ ఉందో కూడా చెబుతారు.. వాటికి సంబంధించి ఆధారాలను కూడా సమర్పిస్తారు అంటూ సునిత కేజ్రీవాల్ వెల్లడించారు. ఇక.. మర్చి 21న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత ఆయన్ను కోర్టు ముందు ఈడీ హాజరు పరిచి కస్టడీకి కోరింది. దీంతో అరవింద్ కేజ్రీవాల్‌ను రేపటి వరకు కస్టడీకి ఇచ్చింది. ఇక, ఈడీ లాకప్ నుంచి అరవింద్ కేజ్రీవాల్ పరిపాలన చేస్తున్నారు. దీనిపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.