లోక్‌సభ ఎన్నికలకు ముందు కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సొంత గూటికి వెళ్తున్నారు. ఇవాళ ( సోమవారం ) మల్లేశ్వరంలోని బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర నేతల సమక్షంలో ఆయన పార్టీలోకి చేరబోతున్నారు.
బీజేపీ అధిష్ఠానం లోక్‌సభ అభ్యర్థుల ఐదో జాబితాను రిలీజ్ చేసింది. 111 మందితో విడుదల చేసిన ఈ జాబితాలో పలు కీలక స్థానాలకు అభ్యర్థులను నియమించింది. కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్ నుంచి బీజేపీ కీలక నేతను అభ్యర్థిగా ప్రకటించింది.
Varun Gandhi: వరుణ్ గాంధీకి బీజేపీ షాక్ ఇచ్చింది. గత కొంత కాలంగా ఆయనకు బీజేపీ టికెట్ ఇవ్వకపోవచ్చనే ప్రచారం నేపథ్యంలో.. తాజాగా ప్రకటించిన 5వ జాబితా అభ్యర్థుల్లో ఆయన పేరు లేదు. ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ పిలిభిత్ నుంచి ఎంపీగా ఉన్న వరణ్ గాంధీ స్థానాన్ని కాంగ్రెస్ మాజీ నేత జితిన్ ప్రసాదకు కేటాయించింది.
ఊహించని విధంగా ఆ మాజీ ఎమ్మెల్యే అసెంబ్లీ టికెట్ దక్కించుకున్నారా ? కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన సదరు నేతకు…టీడీపీ, జనసేన, బీజేపీ నేతలకు అండగా ఉంటారా ? తమను కాదని టికెట్ ఇవ్వడంతో…పార్టీలకు అతీతంగా ఏకమైన నేతలు రెబెల్స్‌గా బరిలోకి దిగేందుకు రెడీ అయ్యారా ? అన్న పోతే తమ్ముడు…తమ్ముడు పోతే అన్నకు జై కొట్టడానికి టీడీపీ కేడర్ సిద్ధంగా ఉందా ? లేదా ? ఆ నియోజకవర్గంలో అసలేం జరుగుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని…
లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ అధిష్ఠానం 111 మంది అభ్యర్థులతో ఐదో జాబితాను విడుదల చేసింది. తెలంగాణలో రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. ఏపీ నుంచి ఆరుగురు అభ్యర్థులను ప్రకటించింది.
BJP 5th List: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న వారితో బీజేపీ 5వ జాబితాను విడుదల చేసింది. 111 మంది అభ్యర్థులతో జాబితాను ప్రకటించింది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ కంగనా రనౌత్ బీజేపీ తరుపున పోటీలో దిగనుంది. ఇటీవల బీజేపీలో చేరిన కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి అభిజిన్ గంగోపాధ్యాయ కూడా ఎంపీగా పోటీ చేయబోతున్నారు.
Naveen Jindal: లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కి వరస షాకులు తగులుతున్నాయి. కీలక నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. తాజాగా మరోసారి కాంగ్రెస్‌కి బిగ్ షాక్ తగిలింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ నవీన్ జిందాల్ హస్తాన్ని వీడారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆదివారం బీజేపీలో చేరారు. ఆయన గతంలో హర్యానా కురుక్షేత్ర నుంచి కాంగ్రెస్ తరుపున ఎంపీగా ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల ముందు ఆయన బీజేపీలో చేరడం గమనార్హం.
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో అధికార పార్టీకి నేతలు షాకులిస్తున్నారు. ఒకొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. తాజాగా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ కమలం గూటికి చేరారు. వైసీపీకి గుడ్ బై చెప్పి ఆయన.. బీజేపీలోకి చేరిపోయారు.
Gali Janardhan Reddy: మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డి సొంతూగూటికి తిరిగి వస్తున్నారు. గతంలో బీజేపీ పార్టీలో ఉన్న ఆయన కర్ణాటక రాజ్య ప్రగతిపక్ష(కేఆర్పీపీ) పేరుతో కొత్త పార్టీ స్థాపించి, గతేడాది కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచాడు.
బీజేపీ అనుసరిస్తున్న విధానాలు నచ్చకే ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరినట్టు సతీష్ మాదిగ తెలిపారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరులతో సతీష్ మాదిగ మాట్లాడుతూ తాను బీజేపీ కార్యవర్గ సభ్యుడిగా పని చేశానని, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశానని ఆయన తెలిపారు. ఇటీవల బీజేపీ అనుసరిస్తున్న విధానాలు నచ్చక బీజేపీ కి రాజీనామ చేసి కాంగ్రెస్ లో చేరడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ మాదిగ వర్గాలకు మేలు…