PM Modi : ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం దేశవ్యాప్తంగా ఐదు ర్యాలీలు నిర్వహించారు. మూడోసారి బీహార్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు బీహార్లోని గయా చేరుకున్నారు.
Lok Sabha Elections : ఆధునీకరణ యుగంలో అధికార పాలకులు కావడానికి, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఇప్పుడు భౌతిక ఎన్నికల ప్రచారానికి బదులుగా డిజిటల్ ప్రచారానికి ప్రాధాన్యతనిస్తున్నారు.
వైసీపీ అధినేత జగన్ గన్నవరం నియోజకవర్గంలో పర్యటిస్తున్న వేళ ఆ పార్టీకి వైసీపీ నాయకులు ఝలక్ ఇచ్చారు. గన్నవరం మండలం కొండపావులూరు గ్రామానికి చెందిన వైసీపీ పార్టీ కన్వీనర్ కంచర్ల లక్ష్మణ్ రావు(పండు), వార్డు సభ్యులు గజగంటి వేణు.. వైసీపీని వీడి గన్నవరం నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు సమక్షంలో సోమవారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ.. గన్నవరం నియోజకవర్గంలో టీడీపీకి జనాధరణ పెరుగుతుందన్నారు. నియోజకవర్గంలో పసుపు జెండాకు…
ఏపీకి డ్రైవర్ తానేనని.. నష్టపోయిన ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించాలనే ఉద్దేశంతోనే పోరాటం చేస్తున్నానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఇబ్బందుల పాలైన ప్రజల కోసమే బీజేపీ, జనసేనతో కలిసి కూటమిగా వస్తున్నట్లు తెలిపారు. పోరాటం చేయడానికి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చరన్నారు. మోదీ మూడో సారి ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ మ్యానిఫెస్టోతో టీడీపీ సూపర్ సిక్స్ లతో జనాల రాత మారుతుందన్నారు. రాజాంలో పూర్వ వైభవం రావాలన్నది తన చివరి…
PM Modi: తమిళ పార్టీ డీఎంకేతో పాటు దానితో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్రమోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన వ్యతిరేక వైఖరిని అవలంభిస్తున్న డీఎంకేతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడానికి కారణమేంటని ప్రశ్నించారు.
నాలుగు నెలలుగా గత ప్రభుత్వ పాపాలను కాంగ్రెస్ ప్రభుత్వం వెలికి తీస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు అన్నారు. పాత నేరాలన్ని ఒక్కోటి బయటకు వస్తున్నాయి.. ఒక వైపు హామీల అమలు జరుపుతూనే , కేసీఆర్ పాపాల ప్రక్షాళన చేస్తుంది కాంగ్రెస్.. బీజేపీ, కేసీఆర్ రైతు దీక్షలు చూసి సమాజం నవ్విపోతుంది అని తెలిపారు
భారత జనతా పార్టీ తెలంగాణకు చేసింది ఏం లేదు.. రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చని దద్దమ్మ ప్రభుత్వం బీజేపీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం అని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.