BJP Namination: నేటి నుంచి తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ల దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభకానుంది. అయితే.. ఈ నేపథ్యంలోనే ఇవాల్టి నుండి బీజేపీ అభ్యర్థుల నామినేషన్లు వివరాలను బీజేపీ విడుదల చేసింది.
రేపటి నుంచి తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ల దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభకానుంది. అయితే.. ఈ నేపథ్యంలోనే రేపటి నుండి బీజేపీ అభ్యర్థుల నామినేషన్లు వివరాలను బీజేపీ విడుదల చేసింది. నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, జాతీయ నేతలు హాజరు కానున్నట్లు పేర్కొంది బీజేపీ. 18 న మెదక్, మల్కాజ్ గిరి, మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థుల నామినేషన్ వేయనున్నట్లు తెలిపింది బీజేపీ. మెదక్ రఘునందన్ రావు నామినేషన్ కు…
PM Modi: లోక్సభ తొలి విడత ఎన్నిల ఏప్రిల్ 19న జరగబోతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ తొలి దశలో పోటీ చేస్తున్న బీజేపీ, ఎన్డీయే అభ్యర్థులకు వ్యక్తిగతంగా లేఖ రాశారు. ప్రధానమంత్రి సందేశం నియోజకవర్గంలోని ప్రతీ ఒక్కరికీ చేరేలా బీజేపీ కసరత్తులో ఈ లేఖ భాగంగా కనిపిస్తోంది.
Priyanka Gandhi: దేశంలో నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగితే బీజేపీకి 180 సీట్లకు మించి రావని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా అన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 400 స్థానాలు సాధిస్తుందనే నినాదాన్ని ఆమె బుధవారం తోసిపుచ్చారు.
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కేరళలో కాంగ్రెస్ తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్తో పాటు కేసీ వేణుగోపాల్ పోటీ చేస్తున్న అలప్పుజా ఎంపీ నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేస్తున్నారు.
Mamata Banerjee: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ టార్గెట్గా తీవ్ర ఆరోపణలు చేశారు. రామ నవమి రోజు బీజేపీ అల్లర్లు చేయాలని చూస్తోందని, ప్రజలను రెచ్చగొట్టాలని భావిస్తోందని బుధవారం ఆరోపించారు.
కరీంనగర్ లోని వికాస తరంగిణి ఆధ్వర్యంలో జరిగిన శ్రీ సీతారాముల కల్యాణంలో త్రిదండి చిన్నజీయర్ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్న జీయర్ స్వామిని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ దర్శించుకున్నారు.
ప్రతిపక్షాలు భారతీయ జనతా పార్టీపై రాజ్యాంగని మార్చబోతున్నామని ఆరోపణలు చేస్తుందంటూ కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. 80 సార్లు రాజ్యాంగానికి మార్పులు చేసిన పాపానికి కాంగ్రెస్ పాల్పడిందని ఆయన కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. తాజాగా ఆయన ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రతిపక్షాలపై ఆయన పెద్ద ఎత్తున విమర్శలు చేశాడు. ప్రస్తుతం భారతదేశంలో పరిస్థితి చూస్తుంటే.. బీజేపీ ప్రభుత్వానికి 370 సీట్లు అంతకంటే ఎక్కువగా సీట్లు కూడా గెలుచుకుంటాయని…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్రంలో ప్రధాని మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశం 200 ఏళ్లు వెనక్కి పోతుందన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా డీఎంకే అభ్యర్థి టీఆర్ బాలుకు సపోర్టుగా శ్రీపెరంబుదూర్లో జరిగిన ర్యాలీలో సీఎం పాల్గొన్నారు.