భారతదేశంలోని అత్యధిక కాలం పాలన చేసిన పార్టీగా కాంగ్రెస్ కు చరిత్ర ఉంది. అయితే ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కేవలం దేశవ్యాప్తంగా 326 స్థానాలకె కాంగ్రెస్ పరిమితమైంది. ఇందుకు సంబంధించి ఇప్పటివరకు 281 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగతా వారిని ఇంకా హోల్డ్ లో పెట్టింది. అయితే కాంగ్రెస్ కు ఈ పరిస్థితి రావడానికి గల కారణాలు చూస్తే.. Also Read: Bhadrachalam LIVE: భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణం.. ప్రత్యక్షప్రసారం ప్రస్తుతం భారతదేశ ప్రధాని…
నేడు హైదరాబాద్ నగరంలో జరిగే శ్రీ రామ నవమి శోభాయాత్ర సందర్భంగా గోషామహల్, సుల్తాన్ బజార్ ట్రాఫిక్ ఠాణా పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు.
నేడు శ్రీరామనవమి శోభాయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇవాళ ( బుధవారం ) శ్రీరామ నవమి శోభయాత్రకు అనుమతి లేదన్న లేఖను పోలీసులకు రాజాసింగ్ అందజేశారు. ఎవరు అనుమతి ఇచ్చిన ఇవ్వకున్నా శ్రీరామ నవమి శోభయాత్ర చేసి తీరుతానంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 4 నెలలోనే దాదాపు సగానికి పైగా హామీలను అమలు చేస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. గత 10 ఏళ్లలో కేసీఆర్ ఇచ్చిన ఎన్నీ హామీలను అమలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు..
బీజేపీ దొందు దొందే అని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి డిసెంబర్ 9వ తేదీ నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు.. ఎవరికైనా అయ్యిందా..? అని ప్రశ్నించారు. రుణమాఫీ అయ్యినోళ్లు కాంగ్రెస్ కే ఓటేయండి.. కానోళ్లు మాత్రం బీఆర్ఎస్ కే ఓటేయండి అన్నారు.
కాంగ్రెస్ ఎక్కడుంటే మత కల్లోలాలు, కర్ఫ్యూలు, కరప్షన్ ఉంటుంది అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. స్వాత్యంత్రం వచ్చాక ఒక బీసీ నాయకుడు ప్రధాని అయ్యాడు.. దేశంలో అద్భుతమైన రహదారులు వేశాం.
రాష్ట్రంలో ప్రచారం జోరందుకుంది. ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఎన్నికల ప్రచార సభల్లో బీజేపీ అగ్రనాయకులు, ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాధ్, అమిత్ షా, జేపీ నడ్డాలు రాష్ట్రానికి రానున్నట్లు బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ రాజు వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియలో అగ్రనాయకులు పాల్లొంటారని తెలిపారు. ఈ ఐదు సంవత్సరాలలో రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని.. యువత ఉద్యోగాలు లేక పొరుగు రాష్ట్రాలకి వెళ్లిపోతున్నారన్నారు.
హేటిరో సంస్థకు ఇచ్చిన భూమి పై ఇప్పటి వరకు ప్రభుత్వం చర్యలు లేవు అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిని ఆమోదిస్తున్నట్లు అర్థమవుతుంది.. వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కట్టబెట్టడం బాధాకరమన్నారు.
రేపు జరిగే శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచల శ్రీ రాముని కళ్యాణ ప్రసారాలపై ఎలక్షన్ కమిషన్ ఆంక్షలు విధించింది అని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు.