Rajnath Singh: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ కీలకమని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా బీజేపీ ఆభ్యర్ధి తాండ్ర వినోద్ రావు గెలుపును కాంక్షిస్తూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రోడ్ షో నిర్వహించారు. తెలంగాణలో అవినీతి రహిత ప్రభుత్వం కావాలని బీజేపీ కోరుకుందని కేంద్ర మంత్రి అన్నారు. బీఆర్‌ఎస్ అవినీతి ప్రభుత్వాన్ని ప్రజలు తరిమి కొట్టారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ అవినీతి ప్రభుత్వాలేనని విమర్శలు గుప్పించారు. దాదాపు 70 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా కుంభకోణాల చరిత్రేనని ఆయన ఆరోపించారు. బోఫోర్స్, చక్కర ఒక్కటేమిటి అన్ని కుంభకోణాలు కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని పేర్కొన్నారు.
Read Also: Gaddam Vamshi Krishna: గత పదేళ్లుగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు..
మోడీ ప్రభుత్వంలో ఒక్క కుంభకోణం లేదని.. మోడీ ప్రభుత్వం చెప్పిందే చేస్తుందన్నారు. మెజారిటీ వచ్చిన తరువాత జమ్మూ కాశ్మీర్‌ను సంపూర్ణంగా విలీనం చేసిన చరిత్ర బీజేపీదేనని స్పష్టం చేశారు.
బీజేపీ మేనిఫెస్టోలో పెట్టినట్లే రామమందిరం నిర్మించామన్నారు. ఈసారి అధికారంలోకి రాగానే ఉమ్మడి పౌరసత్వం ఇస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నెహ్రూ, ఇందిరా, రాజీవ్‌లు పేదరికం పోగొడుతామని చెప్పారని.. కానీ చేయలేదన్నారు. దేశానికి ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చే విధంగా చేసింది నరేంద్ర మోడీ అని.. పదేళ్లలో ఆర్థిక వ్యవస్థ 11వ స్థానం నుంచి ఐదవ స్థానానికి వచ్చిందన్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో ఇబ్బందులు పడ్డ వారిని మన దేశంలోకి తీసుకుని వచ్చామని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.
#WATCH | Khammam, Telangana: Defence Minister Rajnath Singh holds a roadshow ahead of Lok Sabha Polls 2024. pic.twitter.com/sLqSGn5ZAU
— ANI (@ANI) April 19, 2024