ఆరో దశ లోక్సభ ఎన్నికల్లో భాగంగా 57 లోక్సభ స్థానాలకు మే 25న పోలింగ్ జరగనుంది. ఈ స్థానాల్లో దేశ రాజధాని ఢిల్లీలోని ఏడు లోక్సభ స్థానాలు కూడా ఉన్నాయి. కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీలోని ఏడు స్థానాలకు ఎన్నికల ప్రచారానికి గురవారంతో తెరపడింది.
Sonia Gandhi: కాంగ్రెస్ నేత, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ ఢిల్లీ ఓటర్లను ఉద్దేశించి వీడియో సందేశంలో ప్రసంగించారు. మే 25న ఆరో విడత ఎన్నికల్లో భాగంగా ఢిల్లీలోని 7 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగబోతోంది.
జనగామ జిల్లా జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దశమంత్ రెడ్డి నివాసంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల జీవితాలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పెంక మీది నుండి పొయ్యలో పడ్డట్టయిందని ఆయన అన్నారు. నిజాం రాజ్యం లాగా బిఆర్ఎస్ పరిపాలన చేసింది, కాంగ్రెస్ పరిపాలన కూడా అలాగే ఉందని, వంద రోజుల్లో పూర్తి చేస్తానన్న ఆరు గ్యారెంటీలు తుంగలో తొక్కిందన్నారు…
ఉత్తమ్ స్పందన కోసం నిన్న పొద్దుపోయేదాకా ఎదురు చూసిన.. నేను వాస్తవాలు చెప్పాను కాబట్టే ఉత్తమ్ మొహం చాటేశారని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. ఏం చేయాలో తెలియక నాపై పోలీస్ కేసు పెట్టించారని, ఉత్తమ్ కు చేతనైతే బహిరంగ చర్చకు రావాలన్నారు మహేశ్వర్ రెడ్డి. లేదా సిట్టింగ్ జడ్జితో కమిటీ వేసిన సరే సాక్ష్యాధారాలతో నిరూపించడానికి రెడీ గా ఉన్నానని, సివిల్ సప్లై లో ఉన్న…
Prashant Kishor: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. బీజేపీ అతడిని జాతీయ అధికార ప్రతినిధిగా నియమించిందనే సోషల్ మీడియా స్క్రీన్ షాట్లు కలకలం రేపుతున్నాయి.
గత ప్రభుత్వం కూడా ఇదే అహంకారంతో ఎన్నికలకు పోయి బొక్క బోర్లా పడింది.. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి అదే పరిస్థితి వస్తుందని బీజేపీ నేత రఘునందన్ రావు అన్నారు. ఆరు నెలల క్రితం అడ్డగోలు హామిలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు.. పూటకో మాట మాట్లాడే కాంగ్రెస్ పార్టీకి చదువుకున్న విజ్ఞులు ఓటు వేయకుండా గుణపాఠం చెప్పాలన్నారు.
నల్లగొండ జిల్లాలోని దేవరకొండలో పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో సర్వేలు తలదన్నేలా రిజల్ట్ రాబోతున్నాయి.. అప్పటి ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుకి ఓటు వేయాలని చెప్పారు.
Aravind Kejriwal: స్వాతి మలివాల్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కష్టాలు తీరే సూచనలు కనిపించడం లేదు. ఢిల్లీ పోలీసులు అతని తల్లిదండ్రులను విచారించాలనుకుంటున్నారని అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఒక సంచలనమైన తీర్పును కలకత్తా హైకోర్టు ఇచ్చిందని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. ముస్లింలని ఓబీసీలలో చేర్చడాన్ని అక్కడి న్యాయస్థానం తప్పు పట్టిందన్నారు. 75 ముస్లిం కులాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఓబీసీలలో చేర్చింది.
తెలంగాణను గత 10 సంవత్సరాలుగా అన్ని విధాలుగా దోచుకున్న పార్టీ బీఆర్ఎస్.. తెలంగాణను అన్ని విధాలుగా మోసం చేసిన వ్యక్తి కేసీఆర్.. బీజేపీ మీ అందరూ భద్రత కోసం పని చేస్తుంది.. కరోనాను ఆరోగ్యశ్రీలో కలపలేదు కేసీఆర్ అందుకే చాలా ప్రాణాలు పోయాయి.