జూన్ 4 తర్వాత బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ సంచలన నిర్ణయం తీసుకుంటారని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ జోస్యం చెప్పారు. పాట్నాలో జర్నలిస్టులతో తేజస్వీ మాట్లాడారు. బీజేపీతో నితీష్ సరిగా ఉండడం లేదని చెప్పారు. ప్రస్తుతం మిత్రపక్షం బీజేపీతో నితీష్‌కు సరైన సంబంధాలు లేవన్నారు. ఇక లోక్‌సభ ఎన్నికల తర్వాత చాచా(నితీష్ కుమార్‌ను ఉద్దేశించి) కీలక నిర్ణయమే తీసుకుంటారని చెప్పుకొచ్చారు. ఒకవేళ బీజేపీ నుంచి నితీష్ బయటకు వస్తే మళ్లీ పొత్తు పెట్టుకంటారా? అని తేజస్వీని అడిగితే సమాధానం దాటవేశారు. తర్వాత చుద్దాంలే అని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Anand Deverakonda: అందుకే ఆనంద్ కరెక్ట్ ఆప్షన్ అనిపించింది: దర్శకుడు ఉదయ్ ఇంటర్వ్యూ
ఈ ఏడాది ప్రారంభంలో కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి నుంచి నితీష్ బయటకు వచ్చి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం లోక్‌సభ ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేశారు. రాష్ట్రంలో 40 స్థానాలు ఉంటే 17 స్థానాల్లో బీజేపీ, జేడీయూ 16, చిరాగ్ పాశ్వాన్ 5 స్థానాల్లో పోటీ చేశారు.
ఇది కూడా చదవండి: Solar Storm: సూర్యుడిపై భారీ పేలుడు.. భూమి వైపు దూసుకువస్తున్న ‘‘సౌర తుఫాన్’’
మొత్తం దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆరు విడతల పోలింగ్ ముగిసింది. ఏడో విడత శనివారం జరగనుంది. ఇక ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి: PM Modi: కన్యాకుమారిలో ప్రధాని పర్యటన.. భగవతి అమ్మన్‌లో పూజలు