Maharashtra: మహారాష్ట్రలో సీట్ల పంచాయితీ.. శివసేన- బీజేపీ- ఎన్సీపీల మధ్య లొల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2024 లోక్‌సభ ఎన్నికల చివరి దశకు ఇంకా ఓటింగ్ జరగాల్సి ఉంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మహారాష్ట్రలో ఎన్డీయే కూటమిలోని పార్టీల మధ్య అంతర్గత పోరు కొనసాగుతుంది. ఈ ఏడాది అక్టోబర్‌లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో 80 నుంచి 90 సీట్లను తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర ఎన్నికల్లో 80- 90 స్థానాల్లో పోటీ చేస్తామనే షరతుతోనే అజిత్ పవార్ వర్గం బీజేపీ, శివసేనలతో పొత్తు పెట్టుకుందని ఎన్సీపీ నేత ఛగన్ భుజ్‌బల్ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో మాకు చాలా తక్కువ సీట్లు ( బారామతి, షిరూర్, రాయగడ, ధరాశివ్) మాత్రమే ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.
Read Also: Bachhala Malli : అల్లరి నరేష్ “బచ్చల మల్లి” ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్..
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
కాగా, దీనిపై డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. మహారాష్ట్రలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిందని పేర్కొన్నారు. ఎక్కువ సీట్లు మనకే వస్తాయని చెప్పారు. అయితే, సీట్ల పంపకాల ఫార్ములాపై మూడు పార్టీల నేతల సమావేశంలోనే తుది నిర్ణయం తీసుకుంటామని కూడా తెలిపారు. రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అత్యధికంగా 29 స్థానాల్లో పోటీ చేస్తుంది.. అలాగే, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎక్కువ స్థానాలు మనకే వస్తాయని ఫడ్నవీస్ పేర్కొన్నారు.
Read Also: Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు షాక్.. బెయిల్ పెంపు పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు..!
అలాగే, సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన లోక్‌సభ ఎన్నికలలో 15 స్థానాల్లో పోటీ చేస్తుంది.. అలాగే, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 50 నుంచి 60 సీట్లలో పోటీలో ఉంటామన్నారు. కేవలం 50 సీట్లు వస్తే ఎన్ని గెలుస్తామని సీఎం షిండే అన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 105 సీట్లు గెలుచుకోగా.. ఎన్సీపీ 54 సీట్లు గెలుచుకుంది. అలాగే, అజిత్ పవార్ కూడా లోక్‌సభ ఎన్నికల కంటే అసెంబ్లీపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారని చెప్పారు. ఇక, ఈ ఎన్నికల్లో చాలా సంతోషంగా ఉండొద్దు.. ఓడిపోతే బాధపడవద్దని ఇటీవల కార్యకర్తలకు సూచించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ప్రతి ఒక్కరు సన్నద్ధం కావాలి.. అంతకంటే ముందు పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!