కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బసవరాజ్ బొమ్మై సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని బసవరాజ్ బొమ్మై జోస్యం చెప్పారు.
నేటి రాజకీయాలలో చదువుకున్న వాళ్లకు కూడా వెలకట్టే పరిస్థితి వచ్చిందని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. వరంగల్ జిల్లా ఏకశిలా నగర్లో జరిగిన యూత్ మీటింగ్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు.
బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. "నిరాధార, అసత్య ఆరోపణలు చేస్తూ మహేశ్వర్ రెడ్డి నిత్యం వార్తల్లో ఉండాలని చూస్తున్నారు.
లిక్కర్ లో ప్రభుత్వ పాలసీ ఉంటది.. కానీ అనధికార పాలసీ ఉంటదా? అని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. "మద్యం అందుబాటులో లేకుంటే సేల్స్ తగ్గాలి. కానీ ఎందుకు పెరిగింది సేల్స్.
ఉత్తరప్రదేశ్లోని అజంగఢ్లోని ఖరేవాన్ సరయ్మీర్లో సమాజ్వాద్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సమావేశానికి కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. అయితే.. పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అభివాదం అనంతరం ప్రసంగాన్ని ప్రారంభించేందుకు లేవగానే కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగి సభా వేదిక వద్ద తొక్కిసలాట జరిగింది. ఒక్కసారిగా కార్యకర్తలు వేదికపైకి వచ్చేందుకు ప్రయత్నించారు. అయితే వెంటనే పోలీసులు వారిని అదుపు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. కొద్దిసేపటి తర్వాత ప్రశాంత వాతావరణం ఏర్పడింది.
Prashant Kishor: ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ప్రధాని నరేంద్రమోడీ మరోసారి విజయపథంలో నిడిపించే అవకాశం ఉందని ప్రముఖ ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు.
Sambit Patra: బీజేపీ నేత సంబిత్ పాత్ర నోరుజారి విమర్శలు ఎదుర్కొంటున్నారు. సోమవారం ఒడిశా పూరిలో ప్రధాని నరేంద్రమోడీ రోడ్ షో నిర్వహించారు. దీని తర్వాత మీడియాలో సంబిత్ పాత్ర మాట్లాడుతూ.. ఈ పురాతన పట్టణంలో కొలువదీరిన జగన్నాథుడు ప్రధాని నరేంద్రమోడీ భక్తుడని టంగ్ స్లిప్ అయ్యారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇండియా కూటమితో పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం పన్స్కురాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న దీదీ.. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో తమ పార్టీ తృణమూల్ కాంగ్రెస్కు అత్యధిక సీట్లు వస్తే.. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే భారత కూటమికి పూర్తిగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.
బీజేపీ తరుఫున మండి లోక్సభ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కంగనా రనౌత్ కు నిరసన సెగ తగిలింది. సోమవారం హిమాచల్ ప్రదేశ్లోని లాహౌల్-స్పితి లోయలో ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లింది. ఈ క్రమంలో.. అక్కడి ప్రజలు 'గో బ్యాక్' అంటూ నినాదాలు చేశారు. అంతేకాకుండా.. కంగనా రనౌత్, ప్రతిపక్ష నేత జైరాం ఠాకూర్ల కాన్వాయ్పై రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో ఓ బీజేపీ కార్యకర్త గాయపడ్డాడు. కంగనా గో బ్యాక్ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు…
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ యువమోర్చా సమావేశం నిర్వహించారు. ఈ యువమోర్చ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి కి డబల్ డిజిట్ వస్తుందని, కాంగ్రెస్,బీఆర్ఎస్ కు చెందిన ఓటర్లు కూడా బిజెపికే ఓటు వేశారన్నారు. గత బీఅర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ వేయకుండా నిరుద్యోగుల జీవితాలతో అడుకుందని, కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందన్నారు. అధికారంలోకి వచ్చాక…