Telangana MLC ByPoll: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఎన్నికల ప్రచారానికి ఇవాల్టితో గడువు ముగుస్తుండటంతో ఓరుగల్లుకు అగ్ర నేతలు,ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో పోటా పోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ గానే జరిగిందిని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. మరోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ఉండాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారన్నారు. కోదాడలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గ పట్టభద్రుల ఆత్మీయ సమేళన కార్యక్రమానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ హాజరై మాట్లాడారు.
Puri temple Row: పూరీ జగన్నాథ ఆలయం ప్రస్తుతం ఎన్నికల వార్తల్లో నిలుస్తోంది. పూరీ జగన్నాథుడి ఆలయంలో రత్నబండార్ తాళాలపై ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Tejashwi Yadav: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ.. ఈసారి కూడా ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో బీజేపీ, ఎన్డీయే కూటమి అధికారాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు.
గత ఆరు నెలలుగా తెలంగాణలో రూ. 4 వేల కోట్లు అక్రమంగా వసూలు చేసి, రాహుల్ గాంధీకి పంపిస్తున్నారని బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆరోపించారు. పరకాలలో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
Asaduddian Owaisi: ముస్లిం మహిళల్ని లక్ష్యంగా చేసుకుని ఓటింగ్ సమయంలో అడ్డంకులు సృష్టించాలని బీజేపీ భావిస్తోందని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు.
కౌంటింగ్ కు సిద్ధం కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీజేపీ ఆధ్వర్యంలో ఈ రోజు(శుక్రవారం) వెబక్స్ వీడియో మాధ్యమం ద్వారా రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ.. ఎన్నికల అనంతరం కూటమికి అవకాశం ఉందని పలు విశ్లేషణలు తేటతెల్లం చేస్తున్నాయన్నారు.
MLA Kunamneni Sambasiva Rao on PM Modi: బీజేపీ త్రాచుపాము లాంటిదని, తలలోనే కాదు తోకలోనూ ఆ పార్టీకి విషం ఉంటుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీకి అధికార పిచ్చి పట్టిందని, అధికారం కోసం దేశాన్ని కండఖండాలుగా నరికే ఆలోచనతో బీజేపీ ఉందన్నారు. ఎన్నికల ప్రచారంలో అభివృద్ధి ప్రచారం చేయకుండా.. హిందూ, ముస్లింలను రెచ్చగొట్టే ప్రచారం చేశారని మండిపడ్డారు. మోడీకి ఎన్నికల కమిషన్ అన్న కూడా…
Boora Narsaiah Goud on Bengal CM Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తెలంగాణ బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ ఫైర్ అయ్యారు. 75 శాతం బీసీలను మమత వెన్ను పోటు పొడిచారని, కాంగ్రెస్లో ఉన్న హిందువులంధరు ఆమెపై వ్యతిరేకతతో ఉన్నారన్నారు. జూన్ 4 తరువాత బెంగాల్లోనే కాదు దేశంలోనే పెను మార్పులు సంభవిస్థాయన్నారు. 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని రాహూల్ గాంధీ కూటమి తప్పుడు ప్రచారం చేస్తోందని, మహమ్మద్…
తొర్రూరులో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎన్నో ఆలోచనలు కల్పించి మభ్యపెట్టిందని, బాండ్ పేపర్ రాసిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పై పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టాలన్నారు. 6 గ్యారంటీలు 13 హామీలు వంద రోజుల్లో అమలు చేస్తామని మోసం చేశారని, వంద కాదు 180 రోజులైనా 6 గ్యారంటీలకు దిక్కులేదన్నారు హరీష్ రావు. నిరుద్యోగ…