Arvind Kejriwal: పరువు నష్టం కేసులో ఢిల్లీ మినిస్టర్, ఆప్ నేత అతిషీకి ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. బీజేపీ తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తనన కూడా బీజేపీలో చేరుమని ఆ పార్టీ సన్నిహితులు చెప్పినట్లు, లేకుంటే ఈడీ ద్వారా అరెస్ట్ చేస్తామంటూ బెదిరించారని అతిషీ ఆరోపించారు. తమ ఎమ్మె్ల్యేలకు డబ్బు ఆశ చూపి పార్టీ మార్చాలని బీజేపీ ప్రయత్నించిందని ఏప్రిల్ నెలలో అతిషీ ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలపై బీజేపీ ఢిల్లీ మీడియా సెల్ హెచ్ ప్రవీణ్ శంకర్ కపూర్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. తమ పార్టీ పరువు తీసేలా మాట్లాడారని ఆరోపించాడు. ఈ కేసులో తాజాగా ఈ రోజు ఢిల్లీ కోర్టు జూన్ 29న హాజరుకావాలని సమన్లు జారీ చేసింది.
Read Also: Smoking: సిగరెట్ తాగే అమ్మాయిల సంఖ్య రెట్టింపు.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడి
అయితే, ఈ సమన్లపై ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ‘‘ తర్వాత అతిషీని అరెస్ట్ చేస్తారని ముందే చెప్పాను, ఇప్పుడు అలా ప్లాన్ చేసుకున్నార. ఇది పూర్తిగా నియంతృత్వం. పనికిమాలిన తప్పుడు కేసుల్లో ఆప్ నేతలందర్ని ఒక్కొక్కరిగా అరెస్ట్ చేస్తున్నారు. మోడీ జీ తిరిగి అధికారంలోకి ప్రతి ఒక్క ప్రతిపక్ష నేతనున అరెస్ట్ చేస్తారు. వస్తే మన ప్రియమైన దేశాన్ని నియంతృత్వంన నుంచి రక్షించాలి’’ అని ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో అతిషీ మాట్లాడుతూ బీజేపీ ఆప్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ. 25 కోట్లు ఆఫర్ చేసిందని, తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోందని అతిషి ఆరోపించారు.