రాజ్యసభలో ఎన్డీఏకు బలం తగ్గిపోయింది. బిల్లులు ఆమోదం పొందాలంటే ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి ఏర్పడింది. 245 మంది సభ్యులు ఉన్న రాజ్యసభలో.. ఎన్డీఏ సంఖ్య 101కి పడిపోయింది.
తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీపై మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. రుణమాఫీ మార్గదర్శకాల పై ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎటువంటి కండిషన్ లేకుండా రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారని, మరి ఈరోజు ఇన్ని కండిషన్స్ ఎందుకు.? అని ఆయన అన్నారు. రీ షెడ్యూల్ అయిన రుణాలకు మాత్రమే రుణమాఫీ ఇస్తామని అంటున్నారని, చాలా బ్యాంకులు లోన్ రికవరీ అయ్యి మళ్ళీ కొత్తగా లోన్ ఇచ్చినట్టు…
BJP: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ప్రధాని నరేంద్రమోడీ ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని అన్నారు.
మాజీ మంత్రి హరీష్ రావును కేంద్ర మంత్రి బండి సంజయ్ పొగడతలతో ముంచెత్తారు. ఉద్యమం చేసి ప్రజల్లో అభిమానం ఉన్న నేత అని అన్నారు. హరీష్ రావు మంచి నాయకుడు.. హరీష్ రావు ప్రజల మనిషి అని తెలిపారు. కేటీఆర్, కేసీఆర్ మాత్రం ప్రజల విశ్వాసం కోల్పోయిన నేతలు అంటూ, హరీష్ రావు మంచి నాయకుడు పొగిడారు. ఢిల్లీలో బీఆర్ఎస్ నేతలు, బీజేపీ నేతలతో చర్చలు జరిపారా అంటూ మీడియా ప్రశ్నించగా.. ఆయన స్పందించారు.
దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ బైపోల్స్ ఫలితాల్లో ఇండియా కూటమి ఘన విజయం సాధించింది. ఈ మేరకు కూటమి నేతలంతా సంబరాలు చేసుకున్నారు. ఇక ఈ ఫలితాలపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తనదైన శైలిలో స్పందించారు
PM Modi: ప్రతిపక్షాలు ‘‘నకిలీ కథనాలను’’ ప్రచారం చేస్తున్నాయని ప్రధాని నరేంద్రమోడీ ఫైర్ అయ్యారు. శనివారం ముంబైలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. ఇలా నకిలీ కథనాలను ప్రచారం చేసేవారు అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాదికి వ్యతిరేకమని అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా ఇతర పార్టీల్లో చేరుతున్నారు. ఇలా ఇప్పటివరకూ 9 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు, మరి కొందరు కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇంకొందరు కూడా పార్టీ మారుతారని వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్కు బైబై చెప్పి బీజేపీలో చేరబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీ మార్పు…
INDIA bloc: ఏడు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి సత్తా చాటింది. మొత్తం 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 10 స్థానాలను కూటమి కైవసం చేసుకోగా, బీజేపీ కేవలం 02 సీట్లకు మాత్రమే పరిమితమైంది.