PM Modi: బీహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌పై విరుచుకుపడ్డారు. ‘‘అవినీతికి పాల్పడిన యువరాజులు’’ అని పిలిచారు. వీరిద్దరు ‘‘తప్పుదు హామీల దుకాణం’’ నడుపుతున్నారని ఆరోపించారు. బీహార్ లోని ముజఫర్‌పూర్‌లో జరిగిన మెగా ర్యాలీలో గురువారం ప్రధాని మోడీ పాల్గొన్నారు.
ప్రతిపక్ష నాయకులు భారత్, బీహార్‌లో అత్యంత అవినీతి కుటుంబాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని ప్రధాని మోడీ ఆరోపించారు. రెండు కుటుంబాలు కోట్లాది రూపాయల కుంభకోణాలలో బెయిల్‌పై బయట ఉన్నారని అన్నారు. ఇద్దరు ప్రతిపక్ష నాయకులు తను దుర్భాషలాడుతున్నారని, సామాన్యుడు ఎదగడాన్ని వారు జీర్ణించుకోలేరని, దళితులను, వెనకబడిన వర్గాలను కించపరడచం వారి జన్మహక్కుగా భావిస్తున్నారని విమర్శించారు. ఒక పేద, వెనకబడిన కుటుంబానికి చెందిన టీ అమ్ముకునే వ్యక్తి, ఇప్పుడు దేశ అత్యున్నత పదవిని ఆక్రమించడాన్ని సహించలేదరని రాహుల్, తేజస్వీలను విమర్శించారు.