ప్రధాని మోడీ-ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ సారధ్యంలో అభివృద్ధిలో బీహార్ కొత్త శిఖరాలకు చేరిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. తొలి విడత ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడడంతో అన్ని పార్టీల నాయకులు ప్రచారం ఉధృతం చేశారు. బుధవారం అమిత్ షా దర్భంగాలో ఎన్నికల ర్యాలీ నిర్వహిచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మరోసారి మోడీ-నితీష్ నాయకత్వంలో బీహార్ అభివృద్ధి అవకాశం ఇవ్వాలని కోరారు. సీతామర్హిలో గొప్ప ఆలయం నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Modi-Trump: ‘‘అందమైన వ్యక్తి.. చాలా కఠినుడు’’ దక్షిణ కొరియా టూర్‌లో మోడీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
బీహార్‌లో రెండు విడతలుగా పోలింగ్ జరుగుతోంది. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదలకానున్నాయి. తొలి విడత పోలింగ్‌కి సమయం దగ్గర పడడంతో అన్ని పార్టీల నేతలు ప్రచారాన్ని ఉధృతం చేశారు. ప్రధానంగా ఎన్డీఏ కూటమి-ఇండియా కూటమిల మధ్య పోటీ నెలకొంది. ఇక మహాఘట్‌బంధన్ ముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్‌ను ఎంపిక చేశారు. ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రిని మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
ఇది కూడా చదవండి: Chennai: చెన్నైలో దారుణం.. మహిళపై అత్యాచారం చేసి బైక్ టాక్సీ డ్రైవర్ పరార్