భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2028 నాటికి భారతదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ప్రారంభించనుంది. ఈ మేరుక ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ గతంలో కూడా వెల్లడించారు.
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఇస్రోకు సంబంధించిన పలు ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఇందులో చంద్రయాన్-4, వీనస్ మిషన్, ఇండియన్ స్పేస్ స్టేషన్, తదుపరి తరం ప్రయోగ వాహనాలను అభివృద్ధి చేయడం వంటి ప్రతిపాదనలు ఉన్నాయి.
బీజేపీ నాయకులు ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నారాయణగూడ చౌరస్తాలో బీజేపీ నేత దిష్టిబొమ్మను ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు దహనం చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీగా నారాయణగూడ చౌరస్తాలో నిరసన తెలిపారు కాంగ్రెస్ నేతలు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు వెంటనే రాహుల్ గాంధీకి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీపై…
వన్ నేషన్, వన్ ఎలక్షన్‌కి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో.. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టనున్నారు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే దిశగా కేంద్ర మంత్రివర్గం ఈరోజు భేటీ అయింది.
Congress: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హత్యకు కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. ఈ మేరకు పలువురు బీజేపీ నేతలపై ఈరోజు ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు. అలాగే, ఫిర్యాదు ప్రతిని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అజయ్ మాకెన్ పంపారు.
Karnataka Governor: కర్ణాటక ప్రభుత్వం- రాజ్భవన్ల మధ్య తీవ్ర స్థాయిలో వివాదం కొనసాగుతుంది. మే 2023 నుంచి లోకాయుక్తలో ప్రభుత్వ అధికారులపై ప్రాసిక్యూషన్ కేసులపై గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ సమాచారం కోరారు.
ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్‌కు నైతిక విలువలు ఉండుంటే.. అరెస్ట్ అయినప్పుడే రాజీనామా చేసేవారని వ్యాఖ్యానించారు. రాజ్‌నాథ్ సింగ్ ఓ మీడియా సంస్థతో మాట్లాడారు.
జమ్మూకాశ్మీర్‌లో బుధవారం తొలి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఫస్ట్ ఫేజ్‌లో మొత్తం 24 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక సిబ్బంది కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై ఎంపీ పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ధ్వంసం చేయాలనే ఆలోచన కేంద్రానికి లేదని.. స్టీల్ ప్లాంట్‌ని కాపాడి, లాభాల్లోకి తీసుకురావాలనేదే కేంద్రం ఉద్దేశమని పురంధేశ్వరి వెల్లడించారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి సానుకూలంగా స్పందించారన్నారు.
Amit Shah: చిన్న పల్లెటూరిలో పుట్టి దేశాని ప్రధాని అయి, దేశానికి గర్వకారణగా నిలిచారని ప్రధాని నరేంద్రమోడీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశంసలు కురిపించారు. ఈ రోజు మోడీ పుట్టిన రోజు సందర్భంగా దేశంలోని 140 కోట్ల మంది ప్రజలతో పాటు మేము కూడా ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడి ప్రార్థిస్తున్నామని అన్నారు.