Devendra Fadnavis: ఎన్సీపీతో పొత్తు పెట్టుకోవడం బీజేపీ ఓటర్లకు ఇష్టం లేదు..
- ఎన్సీపీతో పొత్తు పెట్టుకోవడం బీజేపీ ఓటర్లకు నచ్చలేదు..
- ఓట్లు బదిలీ కాకపోవడంతోనే లోక్‌సభ ఎన్నికల్లో పరాజయం..
- అసెంబ్లీ ఎన్నికల్లో ఇది పునరావృతం కాదు..
- డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devendra Fadnavis: 2024 లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ ఘోర వైఫల్యంపై డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ నుంచి ఓట్ల బదిలీ జరగకపోవడమే కారణమని గురువారం అన్నారు. ఎన్సీపీతో పొత్తు పెట్టుకోవడం బీజేపీ ప్రధాన ఓటర్లు ‘‘కోర్ వోటర్ బేస్’’కి నచ్చలేదని అన్నారు. అయితే, 80 శాతం మంది మాత్రం ఇప్పుడు అలాంటి రాజకీయాల్లో రాజీ అవసమని ఎన్నికల ద్వారా ఒప్పుకున్నారని ఆయన అన్నారు.
బీజేపీ, ఎన్సీపీ(అజిత్ పవార్), శివసేన(ఏక్‌నాథ్ షిండే) అధికార కూటమి మొత్తం మహారాష్ట్రలోని 48 లోక్‌సభస స్థానాల్లో కేవలం 17 స్థానాలను మాత్రమే గెలుచుకుంటి. 2019లో సొంతగా 23 ఎంపీ స్థానాలను సాధించిన బీజేపీ ఈ సారి 9 స్థానాలకే పరిమితమైంది.
Also Read
- UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
- UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
- Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
- IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
Read Also: Rachana Banerjee: ‘‘ క్వింటాల్ క్వింటాల్ వాటర్’’.. ఒకప్పటి తెలుగు హీరోయిన్, ఎంపీపై ట్రోలింగ్..
గత కొన్ని సార్వత్రిక ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో చెత్త ప్రదర్శన చేశామని, మేము 28 స్థానాల్లో పోటీ చేస్తే, చాలా తక్కువ సీట్లు వచ్చాయని అన్నారు. మేము 3 శాతం కంటే తక్కువ ఓట్ల తేడాతో 12 సీట్లను కోల్పోవాల్సి వచ్చిందని చెప్పారు. 3000 -6000 తేడాలో ఓడిపోయామని అన్నారు. ఈ ఎన్నికల్లో షిండే 07, అజిత్ పవార్ 01 సీట్లనను గెలుచుకున్నాయి. రాష్ట్ర ఎన్నికల్లో ఇది పునరావృతం కాదని స్పష్టం చేశారు.
శివసేన తన ఓట్లను బీజేపీకి బదిలీ చేయడం సులభం, ఎందుకంటే రెండు పార్టీలు చాలా ఏళ్లుగా పొత్తులో ఉన్నాయని, మేం ఎప్పుడూ ఎన్సీపీకి వ్యతిరేకంగా పోటీ చేశామని, అందువల్ల ఆ ఓట్లను బదిలీ చేయడం కష్టమైందని అన్నారు. కానీ ఇప్పుడు రెండు పార్టీల ఓటర్ల బేస్ స్థిరపడిందని ఫడ్నవీస్ చెప్పారు. తమ కూటమి అవశ్యకతను కార్యకర్తలకు చెప్పి ఒప్పించామని, మా ఓటర్లలో కనీసం 80 శాతం మంది ఇప్పుడు ఎన్సీపీతో పొత్తును ఒప్పుకున్నారని అన్నారు. రాష్ట్రంలో 288 అసెంబ్లీ సీట్లలో పోటీ గురించి 80 శాతం చర్చలు ముగిశాయని అన్నారు. నవంబర్ నెలలో మహారాష్ట్ర ఎన్నికలు జరగే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
-
Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!