ఎట్టి పరిస్థితుల్లో కూటమి ఎమ్మెల్యేలు ఇసుక విషయంలో జోక్యం చేసుకోవద్దు అని స్పష్టం చేశారు చంద్రబాబు.. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలపై ఇప్పటికే విచారణ జరుగుతోంది. ఆయా నియోజకవర్గాల్లో ఇసుక విషయంలో జోక్యం చేసుకోకుంటే.. రాబోయే రోజుల్లో మన గెలుపునకు అదే దోహదం చేస్తుందన్నారు.. మూడు పార్టీల్లోని ఎమ్మెల్యేలు ఉచిత ఇసుక విధానాన్ని జయప్రదం చేసేలా సహకరించాలని కోరారు..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న నేతలకు శుభవార్త చెప్పారు టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మంగళగిరి నిర్వహించిన ఎన్డీఏ శాసన సభా పక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దుష్ప్రచారాలని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.. మనం చేస్తున్న పనులను చెప్పుకుంటూనే.. వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని సూచించారు.. వైఎస్ వివేకా హత్యపై వైసీపీ చేసిన దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టలేకపోయాం అన్నారు.. ఇక, నామినేటెడ్ పోస్టులు ఉంటాయి..…
ఈరోజు ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం పీఎం-ఆశా పథకం కోసం రూ. 35,000 కోట్లను ఆమోదించింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ రైతు సోదర సోదరీమణులకు సరసమైన ధరలకు ఎరువులు నిరంతరం సరఫరా చేసేందుకు, 2024 రబీ సీజన్‌కు పోషకాల ఆధారిత సబ్సిడీ ధరలకు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు.
వన్ నేషన్-వన్ ఎలక్షన్‌కు బీఎస్పీ అధినేత మాయావతి జై కొట్టారు. మోడీ 3.0 సర్కార్ హయాంలోనే జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది. ఇప్పటికే కేంద్రమంత్రులు ప్రకటనలు చేస్తున్నారు. జమిలి ఎన్నికలు నిర్వహించి తీరుతామని ప్రకటించారు. ఇక బుధవారం కేంద్ర కేబినెట్ కూడా ఆమోదముద్ర వేసింది. శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్ ఉభయసభల్లో బిల్లు తీసుకురానున్నారు.
మూడు పార్టీలు.. మూడు రకాల స్వభావాలు.. కానీ, ఒకటే ఆలోచన.. ఈ మూడు పార్టీల కలయిక శాశ్వతంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మంగళగిరిలో జరిగిన ఎన్డీఏ శాసన సభాపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ మాట్లాడుతుంటే గతం గుర్తొస్తోంది. ఆ రోజుల్లో భయంకరమైన పరిస్థితులుండేవి. పవన్ ఏపీకి రావాలంటే ఫ్లైట్ క్యాన్సిల్ చేశారు. ఫ్లైట్ క్యాన్సిల్ చేస్తే.. రోడ్డు మార్గంలో వచ్చారు. రోడ్ మార్గంలో కూడా పవన్‌ను రానివ్వలేదు.
జమ్మూకాశ్మీర్‌లో తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. బుధవారం 24 నియోజకవర్గాల్లో ఫస్ట్ ఫేజ్-1 ఓటింగ్ జరిగింది. ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ బూత్‌లకు తరలివచ్చారు. ఉదయం నుంచే ఓటర్లు.. ఓటేసేందుకు భారీగా క్యూ కట్టారు.
ఎన్డీఏ శాసన సభాపక్ష సమావేశంలో కూటమి గెలుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని నేను ప్రకటన వెనుక రాష్ట్రం బాగుండాలనే కోరికే తప్ప.. వ్యూహాలు లేవు అని వ్యాఖ్యానించారు.. అయితే, వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా ఉండడానికి ఎంతో కష్టపడ్డాం అన్నారు.. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదనే బలమైన ఆకాంక్షే.. అద్భుత విజయాన్ని తెచ్చి పెట్టింది. అందరి సమిష్టి కృషితో అద్భుత విజయం సాధ్యమైందన్నారు..…
వన్ నేషన్, వన్ ఎలక్షన్స్ ఆచరణ సాధ్యం కాదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అన్నారు. కేంద్రం ఈ ప్రతిపాదనను ప్రజలెవరూ అంగీకరించని తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అసలు సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు బీజేపీ ఇలా చేస్తుందని ఖర్గే ఆరోపించారు.
బీజేపి నేతలు రాహుల్ గాంధీ పై వివాదాస్పద వాఖ్యలను నిరసిస్తూ హన్మకొండలోని అంబేద్కర్ జక్షన్ వద్ద వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసనకు ముఖ్యఅతిధిగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ, బీజేపీ పార్టీ వాళ్లు.. రాహుల్ గాంధీ కుటుంబం కాలిగొట్టికి కూడా సరిపోరన్నారు. కొందరు వెధవలు…