Satyapal Malik: జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మరోసారి బీజేపీపై విరుచుకుపడ్డారు. బీజేపీ శవపేటికకు మహారాష్ట్ర చివరి మేకు అవుతుందని ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో శనివారం అన్నారు. రాబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా ఓడిపోతుందని జోస్యం చెప్పారు. హర్యానాలో పాటు మహారాష్ట్రకు కూడా ఎన్నికలు జరగాల్సి ఉందని, అయితే ఓటమి భయంతోనే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల మాదిరిగానే వీటిని కూడా వాయిదా వేశారని మాలిక్ అన్నారు.
అమెరికా పర్యటనలో సిక్కులపై కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సిక్కులు ఢిల్లీలో నిరసనలు చేపట్టారు. బీజేపీ నేతల తీవ్రంగా తప్పుపట్టారు. తాజాగా అమెరికాలో చేసిన వ్యాఖ్యలపై రాహుల్ స్పందించారు. తన వ్యాఖ్యలపై బీజేపీ పార్టీ అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
Rahul Gandhi: రాహుల్ గాంధీ తన అమెరికా పర్యటన సమయంలో రిజర్వేషన్లు, సిక్కులపై మాట్లాడిన మాటలు వివాదాస్పదమయ్యాయి. అయితే, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలపై అమెరికాలో ఆయన చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. బెంగళూర్‌లోని హైగ్రౌండ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్కి అధికారికంగా ఫిర్యాదు చేశారు.
Rahul Gandhi: కాంగ్రెస్ అధినేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటన వివాదాస్పదంగా మారింది. సిక్కులపై, రిజర్వేషన్లపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ విరుచుకుపడింది. మరోవైపు సిక్కులపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సిక్కు సంఘాలు సోనియా గాంధీ నివాసం ముందు నిరసన తెలిపారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాపనార్థాలు పెట్టారు విష్ణుకుమార్ రాజు... కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ పాతాళానికి జారిపోవడం ఖాయమన్న ఆయన.. దేవుడిని మోసం చేసిన పార్టీలో ఉండాలో వద్దో అక్కడ వున్న నాయకత్వం ఆలోచించుకోవాలని సూచించారు. వైసీపీని వీడి తమకు అనుకూలంగా ఉన్న పార్టీలో చేరాలని నేతలకు సూచించారు విష్ణుకుమార్ రాజు.
పార్లమెంట్ తొలి శీతాకాల సమావేశాలకు ఇంకా రెండు నెలల సమయం ఉంది. అయితే ఈ సమావేశాలు రాజకీయ వేడెక్కే సూచనలు ఇప్పటికే వెలువడుతున్నాయి. వక్ఫ్ బిల్లు, వన్ నేషన్-వన్ ఎలక్షన్ వంటి అంశాలు రాబోయే పార్లమెంటు సమావేశాల్లో నిప్పుపుట్టించనున్నాయి. నెక్స్ట్ అంతకు మించిన కొత్త బిల్లులు ప్రభుత్వ అజెండాలో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టవచ్చు. READ MORE: Kondapalli Srinivas: అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందిస్తాం.. మోడీ…
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆర్టికల్ 370 రద్దు అంశంపై రాజకీయాలు వేడెక్కాయి. పాక్ రక్షణ మంత్రి ఇచ్చిన ప్రకటన కారణంగా ఎన్సీ, కాంగ్రెస్ రెండూ బీజేపీ టార్గెట్‌గా మారాయి.
PM Modi: జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫేజ్-1లో రికార్డు స్థాయిలో 60.21 ఓటింగ్ నమోదైందని ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు (గురువారం) ప్రశంసించారు. అలాగే, కాశ్మీర్ లో 50వేల మంది డ్రాప్ అవుట్ విద్యార్థులను తిరిగి స్కూళ్లకు తీసుకొచ్చామని ఆయన పేర్కొన్నారు.
Jamili Elections: దేశంలో జమిలి ఎన్నికలపై రాజకీయ రచ్చ స్టార్ట్ అయింది. అనుకూల, ప్రతికూల వాదనలు ఎలా ఉన్నా జమిలి ఎన్నికల సాధ్యంపై మోడీ సర్కార్ ముందు పలు సవాళ్లున్నాయి. దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంటుతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాలంటే 6 రాజ్యాంగ సవరణలు చేయాల్సిన పరిస్థితి ఏర్పాడింది.