Dera baba: హర్యానా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇద్దరు మహిళలపై లైంగికదాడికి పాల్పడిన కేసులో దోషిగా తేలిన ‘డేరా సచ్చా సౌదా’ అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ పెట్టుకున్న పెరోల్ పిటిషన్‌కు ఎలక్షన్ కమిషన్ సోమవారం ఆమోదం తెలిపింది. దీనిపై హర్యానా కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఈరోజు (మంగళవారం) ఈసీకి లేఖ రాసింది. హర్యానా ఎన్నికల టైంలో జైలు నుంచి డేరా బాబాను రిలీజ్ చేయడం ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించినట్లైతుందని కాంగ్రెస్ పేర్కొంది.
Read Also: GST collections: సెప్టెంబర్‌లో భారీ పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. ఎన్ని కోట్లంటే..!
అలాగే, 2019లో డేరా బాబా చేతిలో హత్య చేయబడిన జర్నలిస్ట్ కుమారుడు సైతం ఆయన పేరోల్‌పై రిలీజ్ కావడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ కుమారుడు మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో డేరా బాబాను రిలీజ్ చేయటం.. ప్రజాస్వామ్య విలువలు, ఎన్నికలు, ఓటింగ్ హక్కును ఉల్లంఘించడేనన్నారు. ఆయన ముఖ్యంగా ఒక పార్టీకి ప్రయోజనం చేకూర్చే సందేశాలను హర్యానా ప్రజలకు పంపటం ద్వారా ఓటింగ్‌ను ప్రభావితం చేసే ఛాన్స్ ఉందన్నారు.
Read Also: Aarti Ravi: విడాకుల ప్రకటన తరువాత స్టార్ హీరోని వదలని భార్య.. ఏం చేసిందో చూడండి
ఇక, డేరా బాబాకు పంజాబ్, ఉత్తరప్రదేశ్‌తో పాటు ప్రస్తుతం బీజేపీ పాలించే హర్యానాలో ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. ఈసారి హర్యానాలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా పోటీ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో డేరాబాబాను పెరోల్‌పై రిలీజ్ చేయడాన్ని హర్యానా కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.