Haryana: హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని అన్ని సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్‌లో కుండబద్ధలు కొట్టాయి. మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ సాధిద్దామని అనుకున్న బీజేపీ ఆశలపై హర్యానా ఓటర్లు నీళ్లు చల్లారు. గత పదేళ్లుగా బీజేపీ వైఫల్యాలే కాంగ్రెస్ విజయానికి సోపానాలు అవుతున్నాయి. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ హర్యానాలో బలంగా పుంజుకుంది. మొత్తం 90 స్థానాలు ఉన్న హర్యానా అసెంబ్లీలో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ 46 కన్నా ఎక్కువ స్థానాలు సాధిస్తుందని అన్ని సర్వేలు చెప్పాయి. బీజేపీకి కేవలం 20-28 సీట్లు మాత్రమే వస్తాయని అంచనా వేసింది.
హర్యానాలో బీజేపీకి ప్రజాదరణ క్షీణించింది. పదేళ్లుగా అధికారంలో ఉండటం బీజేపీపై ప్రజావ్యతిరేకతను పెంచింది. పెరుగుతున్న అసంతృప్తిని తగ్గించేందుకు 2024లో సీఎం మనోహర్ లాల్ కట్టర్‌ని తొలగించి, నయాబ్ సైనీని సీఎం చేసింది. ఇది కూడా పార్టీకి మైనస్ అయింది. ఇక రెజ్లర్ల నిరసన, రైతులు ఉద్యమం జాట్ వర్గం పూర్తిగా బీజేపీ నుంచి కాంగ్రెస్ వైపు మళ్లింది. ఇక ముస్లింలు ఎప్పటి నుంచో బీజేపీకి దూరంగానే ఉన్నారు. గతేడాది అల్లర్లు జరిగిన నుహ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ముస్లింలు కాంగ్రెస్‌కి ఓటేశారు.
అధిక నిరుద్యోగం, అగ్నివీర్ అంశం కూడా బీజేపీ కొంపముంచాయి. నిజానికి అగ్నవీర్ అనేది సైన్యానికి అత్యంత కీలకం. అయితే, హర్యానా నుంచి ఎక్కువ మంది ఆర్మీలో జాయిన్ అవుతుంటారు. అగ్నివీర్ అనేది తమను నష్టపరుస్తుందని అక్కడి యువత భావించింది. ఇక హర్యానాలో నిరుద్యోగం 2021-22లో 9 శాతం ఉంది. ఇది జాతీయ సగటు 4.1 కన్నా రెండింతలు. తన మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, దాదాపుగా 1.84 లక్షల్ ఖాళీలు భర్తీ చేయడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైంది. పోటీ పరీక్షల కుంభకోణం నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం 47 పరీక్షల్ని రద్దు చేయడం కూడా విశ్వసనీయతను దిగజార్చింది.
Read Also: Gujarat: ఫ్రెండ్‌ని కలిసేందుకు వెళ్లిన టీనేజీ బాలికపై గ్యాంగ్ రేప్..
ఇక పట్టణ ఓటర్లలో కూడా బీజేపీ అసంతృప్తి పెరిగింది. సాంప్రదాయకంగా పట్టణ ఓటర్లు బీజేపీ వైపు ఉంటారు. ఈ సారి బీజేపీ తమను పట్టించుకోలేదనే ఆలోచన వారిలో ఉంది. మొత్తం పట్టణ ఓటర్లు బీజేపీకి ఓటేయవద్దని నిర్ణయించుకున్నారు. 2 కోట్ల మంది అర్హత ఉన్న ఓటర్లలో కోటి మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇది కూడా బీజేపీ ఘోరంగా దెబ్బతీసింది.
అవినీతిని అరికట్టేందుకు ఖట్టర్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఇ-గవర్నెన్స్ విఫలమైంది. మెరుగైన సేవల కోసం ప్రభుత్వం పరివార్ పహచాన్ పాత్ర(పీపీపీ), మేరీ ఫసల్ మేరా బైరాతో పాటు అనేక ఆన్‌లైన్ పోర్టల్స్‌ని అందుబాటులోకి తెచ్చింది. అయితే ప్రజలు వీటిని వినియోగించుకోవడంలో ఇబ్బందులు పడ్డారు. దీనికి తోడు ఇంటర్నెట్ కనెక్టివిటీ సక్రమంగా లేకపోవడం కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచింది.
ఇక బీజేపీ తాను ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. ఉదాహరణకు, ఆగస్ట్ 2024లో, ప్రభుత్వం 24 పంటలకు MSP చెల్లించే ప్రణాళికను ప్రకటించింది, అలాగే అగ్నివీరులకు 10% హారిజాంటల్ రిజర్వేషన్లు మరియు వడ్డీ రహిత రుణాలను ప్రకటించింది. అయితే, ఈ వాగ్దానాలు కేవలం ఎన్నికలకు ముందు ఇచ్చారు. ఇది కూడా ప్రజల విశ్వాసాన్ని మరింత దూరం చేశాయి. 2020లో తప్పనిసరిగా పరివార్ పహచన్ పాత్రను ప్రవేశపెట్టింది. నమోదు చేసుకున్న 72 లక్షల కుటుంబాల్లో కేవలం 68 లక్షల కుటుంబాలు మాత్రమే వెరిఫై చేయబడ్డాయి. వృద్ధాప్య పింఛన్లలో వ్యత్యాసాలు, కెనెక్టివిటీ సరిగా లేకపోవడంతో పీపీపీ కేంద్రాల వద్ద పొడవైన క్యూలు ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచాయి. ఈ కారణాలు అన్నీ కాంగ్రెస్‌కి వరంగా మారాయి.